PNB Charges : PNB బ్యాంకు కస్టమర్లకు ఛార్జీల మోత.. ఎప్పుటినుంచంటే?

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు షాకింగ్ ఇచ్చింది. సర్వీసు ఛార్జీలను పెంచుతున్నట్టు ప్రకటించింది. జనవరి 15, 2022 నుంచి పెరిగిన ఈ కొత్త సర్వీసు ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.

PNB Charges : PNB బ్యాంకు కస్టమర్లకు ఛార్జీల మోత.. ఎప్పుటినుంచంటే?

Pnb Charges Pnb Account Customers Need To Pay More For These Banking Services

PNB Service Charges : పంజాబ్ నేషనల్ బ్యాంక్ ( PNB ) బ్యాంక్ తమ కస్టమర్లకు షాకింగ్ ఇచ్చింది. బ్యాంకింగ్ సర్వీసు ఛార్జీలను పెంచుతున్నట్టు పీఎన్‌బీ ప్రకటించింది. ఇకపై బ్యాంకింగ్ సర్వీసులను వినియోగించుకునే కస్టమర్లు అధిక మొత్తంలో ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవలే పీఎన్‌బీ ఒక ప్రకటనలో వెల్లడించింది. జనవరి 15, 2022 నుంచి పెరిగిన ఈ కొత్త సర్వీసు ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించి పెంచిన సర్వీసు ఛార్జీల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

కనీస బ్యాలెన్స్ తప్పనిసరి :
మెట్రో నగరాల్లో త్రైమాసిక సగటు బ్యాలెన్స్ (QAB) రూ. 10,000కు పెంచేసింది. గతంలో కనీస బ్యాలెన్స్ నిర్వాహణ రూ. 5,000 మాత్రమే ఉండేది.

మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలు :
మినిమమ్ బ్యాలెన్స్ లేని పీఎన్‌బీ బ్యాంక్ అకౌంట్లపై త్రైమాసిక ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 400 పెంచగా,, పట్టణ మెట్రో ప్రాంతాల్లో రూ. 600కు పెంచినట్టు PMB వెబ్‌సైట్‌లో పేర్కొంది.

బ్యాంక్ లాకర్ ఛార్జీలు :
PNB గ్రామీణ, సెమీ అర్బన్ (SU), పట్టణ మెట్రో ప్రాంతాలలో లాకర్ రెంటల్ ఛార్జీలను కూడా పెంచింది. పట్టణ ప్రాంతాల్లో లాకర్ ఛార్జీలను రూ. 500 పెంచారు.

బ్యాంక్ లాకర్ ఫ్రీ విజిట్ :
జనవరి 15, 2021 నుంచి ఈ సర్వీసు అమల్లోకి రానుంది. ఏడాదికి ఉచితంగా బ్యాంకు లాకర్లను సందర్శించే సంఖ్య 12కి తగ్గించింది. ఆ తర్వాత, ఒక్కో విజిట్‌కు రూ. 00 ఛార్జీ విధించనున్నారు. గతంలో ఏడాదికి లాకర్ సందర్శనల సంఖ్య 15గా ఉండేది.

కరెంట్ అకౌంట్లు క్లోజ్ :
అకౌంట్ ఓపెన్ చేసిన 14 రోజుల తర్వాత క్లోజ్ చేసిన కరెంట్ అకౌంట్లపై రూ. 800 జరిమానా చెల్లించాలి. ఇంతకు ముందు, రూ. 600 వరకు ఛార్జీలు ఉండేవి.. అదే ఏడాది 12 నెలల తర్వాత అకౌంట్లకు ఎలాంటి ఛార్జీలు వర్తించవు.

సేవింగ్స్ అకౌంట్లలో లావాదేవీలపై ఛార్జీలు :
జనవరి 15 నుంచి PNB బ్యాంకు నెలకు 3 ఉచిత లావాదేవీలను మాత్రమే అనుమతిస్తుంది. ఆ తర్వాత ప్రతి లావాదేవీకి రూ. 50/- సర్వీసు ఛార్జ్ విధించనుంది. (BNA, ATM, CDM) మినహా సీనియర్ సిటిజన్ అకౌంట్లకు ఇది వర్తించదు. సేవింగ్స్, కరెంట్ అకౌంట్లలో లావాదేవీల రుసుము పెంచేసింది. బేస్ లేదా నాన్-బేస్ బ్రాంచ్‌తో సంబంధం లేకుండా ప్రస్తుతం నెలకు 5 ఉచిత లావాదేవీలను అనుమతిస్తుంది. ఆపై ప్రతి లావాదేవీకి రూ. 25/- సర్వీసు ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.

క్యాష్ హ్యాండలింగ్ ఛార్జీలు (Cash handling charges) :
సేవింగ్, కరెంట్ అకౌంట్లు రెండింటిపై PNB బ్యాంక్ నగదు డిపాజిట్ లిమిట్ తగ్గించింది. రోజుకు ఉచిత డిపాజిట్ పరిమితి ప్రస్తుత రూ. 2 లక్షల నుంచి రూ. లక్షకు తగ్గించింది. 2022 జనవరి 15 నుంచి ఒక్కో రూ. లక్షపై 10 పైసలు పైన వసూలు చేయనుంది. ఈ ఛార్జీలు బేస్ & నాన్-బేస్ బ్రాంచ్‌లు రెండింటికీ వర్తిస్తాయని PNB వెబ్‌సైట్ పేర్కొంది.

Read Also : Zomato Delivery: తప్పతాగిన పోలీస్.. కారుతో ఢీకొట్టడంతో జొమాటో డెలివరీ బాయ్ దుర్మరణం