Sandhya Sridhar Rao Arrest : చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు ట్రాన్సిట్ వారెంట్ కు కోర్టు అనుమతి ఇచ్చింది. శ్రీధర్ రావు తరపు న్యాయవాది వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. బెయిల్ పిటిషన్ పై విచారించేందుకు నిరాకరించారు. మరోవైపు శ్రీధర్ రావు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు పొందుపరిచారు.
”అపోగేర్ మ్యానుఫ్యాక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో రూ.10 కోట్ల చీటింగ్ చేశారు. మాయమాటలు చెప్పి ఢిల్లీలో ఉన్న 12c ఫ్రెంచ్ కాలనీ ఆస్తి డాక్యుమెంట్లను తీసుకున్నారు. Jipl లో అక్రమంగా డైరెక్టర్ గా చేరారు. శ్రీధర్ సూచనతో లండన్ లో ఉన్న ఆస్తిని రంజిత్ హుడా అమ్మారు. ఆ డబ్బు రూ.2 కోట్లు శ్రీధర్ అకౌంట్ కు, రూ. 8కోట్లు శ్రీధర్ ఆదేశాల మేరకు రాజిరెడ్డి శ్రీనివాస్ అకౌంట్ కు బాధితుడు పంపారు. మరో రూ.2.5 కోట్లు శ్రీధర్ రావు యాక్సిస్ బ్యాంక్ కు పంపారు బాధితులు.
Also Read..Sandhya Sridhar Arrest : చీటింగ్ కేసులో సంధ్య కన్వెన్షన్ ఎండీ సంధ్య శ్రీధర్ అరెస్టు
Roc లోని డిజిటల్ సైన్ ను ఫోర్జరీ చేసి డైరెక్టర్ గా చేరారు శ్రీధర్. బాధితుల ఫిర్యాదు మేరకు 24-12-22లో కేసు నమోదు చేసిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. అవినేశ్, మజీద్, ధర్మేంధర్ సింగ్, అశోక్, వివేక్, కన్ను, రాధాకృష్ణలను నిందితులుగా జాబితాలో చేర్చిన పోలీసులు. విచారణ జరుపుతుండగా తెరపైకి వచ్చిన శ్రీధర్ పేరు.
పలువురు అకౌంట్ల నుండి అనుమానాస్పదంగా శ్రీధర్ అకౌంట్ కు డబ్బు వచ్చినట్టు గుర్తించిన పోలీసులు. శ్రీధర్ అకౌంట్ నుండి నిందితుల అకౌంట్ కి డబ్బులు ట్రాన్సఫర్ అయినట్టు గుర్తించిన పోలీసులు. 19-1-23న అనుమానాస్పద అకౌంట్లు, కంపెనీల లావాదేవీలపై వివరణ ఇవ్వాలంటూ 91crpc కింద నోటీసులు పంపిన ఢిల్లీ పోలీసులు. నోటీసులకు స్పందించకపోవడం తో nbw జారీ చేసిన ఢిల్లీ కోర్టు. విచారణకు సహకరించకపోవడం వల్లే శ్రీధర్ ను అరెస్ట్ చేశామని ఢిల్లీ పోలీసులు తెలిపారు”.
చీటింగ్ కేసులో సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావును ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఒక సివిల్ వ్యవహారంలో తమను మోసం చేశారంటూ శ్రీధర్ పై ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బంధువులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ కు వచ్చారు. శ్రీధర్ రావు ఇంటికి వెళ్లిన ఢిల్లీలో ఆయనను అరెస్ట్ చేశారు. ఇప్పటికే శ్రీధర్ రావుపై అనేక కేసులు ఉన్నాయి.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
దీనిపై స్పందించిన శ్రీధర్ రావు.. అమితాబచ్చన్ బంధువులను తాను మోసం చేశాననడం అవాస్తవం అన్నారు. తాను ఎవరినీ మోసం చేయలేదని తేల్చి చెప్పారు. రూ.180 కోట్లు చెల్లించినట్లు వివరించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. తన దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తానని ఆయన వెల్లడించారు.
ఎస్కార్ట్ కంపెనీ మాజీ వైస్ ప్రెసిడెంట్ అనిల్ నందా ఫిర్యాదుతో సంధ్యా శ్రీధర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీ, లూథియానాలో ఉన్న భూములను ఫోర్జరీ సంతకాలతో శ్రీధర్ అమ్మారు. సుమారు రూ.200 కోట్ల విలువైన భూములను ఫోర్జరీ డాక్యుమెంట్లతో మోసాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. సంధ్యా శ్రీధర్ రావును మూడు రోజుల ట్రాన్సిట్ వారెంట్ పై కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోరారు.