former SIB DSP Praneet Rao
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో సంధ్య కన్వెక్షన్ ఎండీ శ్రీధర్ ఫిర్యాదు చేశారు. శ్రీధర్ న్యాయవాది అరుణ్ దీనిపై మాట్లాడుతూ… గత ప్రభుత్వంలో తమ ఫోన్లు ట్యాప్ చేసి తనపై అక్రమ కేసులు బనాయించారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
దాదాపు 40 కేసులు పెట్టి శ్రీధర్‌ను ఇబ్బందులకు గురి చేశారని న్యాయవాది అరుణ్ అన్నారు. గత ప్రభుత్వం పాలన సమయంలో ఎస్ఐబీలో ఉన్న అధికారులందరిపై సమగ్ర విచారణ జరిపించాలని ఫిర్యాదు చేశామన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు చెప్పినట్లు ఫోన్ ట్యాప్ చేసి, తీవ్ర ఇబ్బందులు గురిచేశారని చెప్పారు.
ప్రణీత్ రావుతో పాటు ప్రభాకర్ రావు, భుజంగరావు, రవీందర్ రావుపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేశారని చెప్పారు.
చేవెళ్ల, వరంగల్ పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసిన కేసీఆర్