9 లోక్‌సభ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన కేసీఆర్.. నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి

BRS: వరంగల్ పార్లమెంటు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య పోటీ చేస్తారు.

9 లోక్‌సభ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన కేసీఆర్.. నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి

BRS

చేవెళ్ల, వరంగల్, జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేశారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. చేవెళ్ల పార్లమెంటు స్థానం నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పోటీ చేయనున్నారు. వరంగల్ పార్లమెంటు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య పోటీ చేస్తారు. అలాగే, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేస్తారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ దశల వారీగా ప్రకటిస్తోంది.

జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీకి రాజీమానా చేసి, బీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఆయనకు లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ పై హామీ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

మరోవైపు, ఇవాళ వరంగల్లోని పార్టీ ముఖ్యనేతలతో జరిపిన చర్చల అనంతరం సమష్టి నిర్ణయాన్ని అనుసరించి వరంగల్ పార్లమెంటు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యను కేసీఆర్ ప్రకటించారు. ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురన్న విషయం తెలిసిందే.

లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల విషయంలో ఇప్పటికే ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ తుది నిర్ణయాలు తీసుకున్నాయి. బీజేపీ మొత్తం 15 స్థానాల అభ్యర్థులను ప్రకటించింది.

ఇప్పటివరకు మొత్తం తొమ్మిది పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ నెల 4న విడుదల చేసిన తొలి దశ జాబితాలో నలుగురి పేర్లను ఆయన ఖరారు చేసిన విషయం తెలిసిందే. కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి బి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం స్థానం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత పోటీ చేస్తారని తెలిపారు. మహబూబ్ నగర్ లో మన్నె శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తారని చెప్పారు. ఇవాళ మరో నలుగురి పేర్లను కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు బీఆర్ఎస్ మొత్తం తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లయింది.

  • 9 మంది అభ్యర్థులు
  • ఖమ్మం -నామా నాగేశ్వర్ రావు
  • మహబూబాబాద్ -(ఎస్టీ)మాలోత్ కవిత
  • కరీంనగర్ -బోయినపల్లి వినోద్ కుమార్
  • పెద్దపల్లి(ఎస్సీ) -కొప్పుల ఈశ్వర్
  • మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి
  • చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్
  • వరంగల్ (ఎస్సీ )-డాక్టర్ కడియం కావ్య
  • జహీరా బాద్ -గాలి అనిల్ కుమార్
  • నిజామాబాద్ – బాజిరెడ్డి గోవర్ధన్

Aroori Ramesh : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఎపిసోడ్ లో ట్విస్ట్