Sankranti Festival Rush : టోల్ గేట్ల దగ్గర బారులు తీరిన వాహనాలు.. పండక్కి పల్లెకు పయనమైన పట్టణం

హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలు, ఏపీకి వెళ్లే రహదారులన్నీ రద్దీగా మారిపోయాయి.

Sankranti Festival Rush : సంక్రాంతి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నగర వాసులు పల్లెబాట పట్టారు. సొంత వారితో కలిసి సంక్రాంతి సంబరాలు సందడిగా చేసుకోవాలని స్వగ్రామాలకు రాజధాని వాసులు పయనం అవుతున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలు, ఏపీకి వెళ్లే రహదారులన్నీ రద్దీగా మారిపోయాయి. జాతీయ రహదారులపై టోల్ గేట్ల దగ్గర వాహనాలు బారులు తీరాయి. నల్గొండ జిల్లా కోర్లపహాడ్ టోల్ గేట్ దగ్గర వాహనాలు బారులు తీరాయి.

సంక్రాంతి పండగ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో హైదరాబాద్ నగరవాసులు పల్లెబాట పట్టారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే రహదారులు, అదే విధంగా హైదరాబాద్ నుంచి తెలంగాణలోని పల్లెలకు వెళ్లే జాతీయ రహదారులన్నీ రద్దీగా మారాయి. హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరారు. హైదరాబాద్ నుంచి వెళ్లే క్రమంలో మొదట వచ్చేది పంతంగి టోల్ గేట్. ఇది యాదాద్రి జిల్లాలో ఉంటుంది. దాని తర్వాత వచ్చేది నల్గొండ జిల్లాలోని కోర్లపహాడ్ టోల్ గేట్.

Also Read : రైతు భరోసాలో అలా జరక్కూడదు..! కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

కోర్లపహాడ్ టోల్ గేట్ దగ్గర చూసినట్లైతే.. ఏడు గేట్లను ఓపెన్ చేశారు. మిగిలిన గేట్లను హైదరాబాద్ వైపు వదిలారు. ఏడు గేట్లు కూడా విజయవాడ వైపు వదిలిపెట్టారు. జనరల్ గా అటు సగం, ఇటు సగం గేట్లను ఓపెన్ చేస్తారు. అయితే, రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ దాదాపు ఏడు గేట్లను విజయవాడ వైపు వదిలిపెట్టారు. అయినప్పటికీ కొంత ట్రాఫిక్ జామ్ అయ్యింది.

కోర్లపహాడ్ టోల్ గేట్ తో పోల్చుకుంటే పంతంగి టోల్ గేట్ దగ్గర 18 గేట్లు ఉంటాయి. కోర్లపహాడ్ టోల్ గేట్ పోలిస్తే అక్కడ అదనంగా ఉంటయి. అక్కడ 18 గేట్లు ఉంటే అందులో విజయవాడ వైపు వెళ్లేందుకు 10 గేట్లు తెరవడం జరిగింది. మరోవైపు హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాల కోసం కేవలం 8 గేట్లు మాత్రమే తెరిచారు.

కాగా, శనివారం మధ్యాహ్నం తర్వాత మరింత రద్దీ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ముందుజాగ్రత్తగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని టోల్ గేట్ల వద్ద అదనపు సిబ్బందిని వినియోగించి వెంటనే ట్రాఫిక్ ను క్లియర్ చేసే పరిస్థితి ఉంది. మొత్తంగా హైదరాబాద్ నుంచి తెలంగాణలోని జిల్లాల వైపు, ఏపీవైపు వెళ్తున్న వాహనాల సంఖ్య పెరిగింది.

 

Also Read : ఖాళీ అవుతున్న హైదరాబాద్ నగరం..! పండక్కి పల్లె‎బాట పట్టిన సిటీ జనం..