CM Revanth Reddy : రైతు భరోసాలో అలా జరక్కూడదు..! కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

కొందరు కలెక్టర్లు ఆ స్థాయిలో వ్యవహరించలేదన్నది తన వ్యాఖ్యల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది.

CM Revanth Reddy : రైతు భరోసాలో అలా జరక్కూడదు..! కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

Updated On : January 10, 2025 / 10:51 PM IST

CM Revanth Reddy : కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వ్యవసాయానికి పనికిరాని భూములకు రైతు భరోసా ఇవ్వొద్దన్నారు. రియల్ ఎస్టేట్ భూములు, లేఔట్ భూములకు రైతు భరోసా ఇవ్వొద్దంటూ కలెక్టర్ల సదస్సులో నిర్ణయం తీసుకున్నారు.

కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్..!
కలెక్టర్ల సదస్సులో కలెక్టర్లకు తనదైన సైల్ లో సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. కచ్చితంగా జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలని కలెక్టర్లకు ఇదివరకే ప్రభుత్వం ఆదేశించింది. అయితే, ప్రభుత్వం ఆశించిన మేరకు ఆ స్థాయిలో ఎక్కడా కూడా కలెక్టర్లు పని చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పనితీరును మరింత మెరుగు పరుచుకోవాలని సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

ఈ నెల 26 నుంచి సీఎం రేవంత్ ఆకస్మిక తనిఖీలు..!
ఈ నెల 26 నుంచి ఆకస్మిక తనిఖీలకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. అన్ని జిల్లాల్లో తాను ఆకస్మిక తనిఖీలు చేస్తానని, అక్కడ పనితీరు మెరుగుపరుచుకోని అధికారులపై అక్కడికక్కడే స్పష్టమైన కఠిన చర్యలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందాలంటే అది కలెక్టర్ల బాధ్యత అని, కలెక్టర్లు చాలా క్రియాశీలకంగా వ్యహరించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అయితే, కొందరు కలెక్టర్లు ఆ స్థాయిలో వ్యవహరించలేదన్నది తన వ్యాఖ్యల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది.

Also Read : కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ.. ఏయే అంశాలపై చర్చించారంటే..

ఆ పథకాల అమలుపై ఫోకస్..
ఈ నెల 26వ తేదీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో పరిపాలనను మరింత పరుగులు పెట్టించే దిశగా ఈ నిర్ణయం ఉంటుందని చెప్పొచ్చు. ఈ నెల 26న మరికొన్ని సంక్షేమ పథకాలను అమలు చేయబోతోంది ప్రభుత్వం. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు.. ఈ నాలుగు సంక్షేమ పథకాలను అమలు చేయాల్సి ఉంది.

ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ పథకాలకు సంబంధించి ప్రిపరేషన్ వర్క్ కంప్లీట్ చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. నిజమైన లబ్దిదారులకు ఎక్కడా అన్యాయం జరక్కుండా పూర్తి పారదర్శకతతో క్షేత్రస్థాయి రిపోర్ట్ ఆధారంగా జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

లబ్దిదారుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశం..
మరోవైపు రైతుభరోసాకు సంబంధించి ఏడాదికి 12వేలు రెండుసార్లు ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరా భూమి కూడా రైతుభరోసా ఇచ్చేలా కలెక్టర్లు పర్యవేక్షించాలని, లబ్దిదారుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు. గత ప్రభుత్వం రియల్ ఎస్టేట్ భూములకు, వెంచర్లకు, ల్యాండ్ అక్విజిషన్ లో ప్రభుత్వ భూములు పోయినప్పటికీ.. ఆ భూములకు కూడా రైతు బంధు తీసుకున్నట్లు రిపోర్టులో తేలింది. ఈసారి మాత్రం అలా జరక్కూడదని కలెక్టర్లకు స్పష్టంగా చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

 

Also Read : గేమ్‌ఛేంజ‌ర్ టికెట్ రేట్ పెంపుపై రాజకీయ రగడ.. సర్కార్ యూటర్న్ తీసుకుందంటూ బీఆర్ఎస్ అటాక్