Site icon 10TV Telugu

Hollyday: గుడ్‌న్యూస్.. రేపు బ్యాంకులు, స్కూల్స్, కాలేజీలు అన్నీ బంద్.. మందుబాబులకు మాత్రం బిగ్‌షాక్..

Schools banks close

Schools banks close

Telangana: తెలంగాణలో బోనాల సందడి నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని లాల్ దర్వాజా సింహవాహిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. ఉదయం అమ్మవారికి కుమ్మరి బోనం సమర్పించారు. ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. అంబర్ పేట్ మహంకాళి ఆలయం, చిలకలగూడ కట్టమైసమ్మ పోచమ్మ ఆలయంతోపాటు తదితర ఆలయాలకు భక్తులు పోటెత్తారు.

తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ప్రజలు బోనాల పండుగను జరుపుకుంటారు. బోనాల పండుగను పురస్కరించుకొని జులై 21వ తేదీన (సోమవారం) ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉంటుంది.

జులై 21న తెలంగాణ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవుగా రిజర్వు బ్యాంక్ సెలవుల క్యాలెండర్ సూచిస్తోంది. ఆర్బీఐ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రజలు ప్రత్యేకంగా జరుపుకునే స్థానిక పండుగులకు సెలవులను ప్రకటిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో సోమవారం తెలంగాణలోని బ్యాంకులు క్లోజ్ కానున్నాయి.

హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగే శ్రీ ఉజ్జయిని మహాకాళి బోనాల జాతర సందర్భంగా వైన్స్ షాపులు, బార్లను జులై 20, 21 తేదీల్లో మూసివేయాలని తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో నగరం పరిధిలో జులై 20వ తేదీ ఉదయం నుంచి జూలై 22వ తేదీ ఉదయం 6గంటల వరకు మద్యం విక్రయాలను నిలిపివేశారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో బోనాల వేడుకలు జరుపుకునేందుకు వీలుగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నివారించే క్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే, రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్ ఉండటం మందు బాబులకు బిగ్ షాకింగ్ న్యూసే అని చెప్పొచ్చు.

 

Exit mobile version