సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక.. అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు వచ్చేనెల 13న పోలింగ్ జరగనుంది. ఈ స్థానానికి ఇప్పటికే ..

Cantonment Assembly BJP Candidate : సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు వచ్చేనెల 13న పోలింగ్ జరగనుంది. ఈ స్థానానికి ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా బీజేపీ అధిష్టానం డాక్టర్ టి.ఎన్. వంశా తిలక్ ను అభ్యర్థిగా ప్రకటించింది. ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ స్థానంలో ఖాళీ ఏర్పడిన విషయం తెలిసిందే.

Also Read : Cantonment By Election : కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

2023 అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్య నందిత విజయం సాధించారు. ఇటీవల ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించింది. దీంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నాల్గో దశలో భాగంగా తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు మే 13న పోలింగ్ జరగనుంది. లోక్ సభ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ స్థానానికి ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానాలు అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ నారాయణ శ్రీగణేశ్ ను బరిలోకి దింపుతుండగా.. బీఆర్ఎస్ పార్టీ లాస్య నందిత సోదరి నివేదికకు టాకెట్ ఖరారు చేసింది. తాజాగా బీజేపీ అధిష్టానం వంశా తిలక్ పేరును ప్రకటించింది.

Also Read : కంటోన్మెంట్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసిన కేసీఆర్

 

ట్రెండింగ్ వార్తలు