కంటోన్మెంట్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసిన కేసీఆర్

Niveditha: లాస్య నందిత కుటుంబ సభ్యుల్లోని ఒకరినే ఎన్నికల్లో పోటీకి దింపాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది.

కంటోన్మెంట్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసిన కేసీఆర్

BRS

తెలంగాణలోని కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నివేదిత పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో చర్చించిన తర్వాత దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు, లాస్య సోదరి నివేదితను అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు చెప్పారు.

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన విషయం విదితమే. దీంతో కంటోన్మెంట్ స్థానానికి ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహిస్తోంది. ఇటీవలే షెడ్యూల్ విడుదలైంది.

లోక్‌సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల మే 13న జరగనుంది. కాగా, కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా గణేశ్‌ పేరును ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించింది. బీజేపీ త్వరలోనే తమ అభ్యర్థి పేరును ప్రకటించనుంది.

లాస్య నందిత కుటుంబ సభ్యుల్లోని ఒకరినే ఎన్నికల్లో పోటీకి దింపాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. చివరికి అదే నిజమైంది. కేసీఆర్ రెండు రోజుల క్రితం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కంటోన్మెంట్ ముఖ్యనేతలతో సమావేశమై చర్చించారు.

Also Read: ఆ పార్టీకి పవన్ కల్యాణ్ పెద్ద కోవర్ట్: పోతిన మహేశ్