Cantonment By Election : కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థిని ప్రకటించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

Cantonment By Election : కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

Narayanan Sri Ganesh

Narayanan Sri Ganesh : సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థిని ప్రకటించింది. నారాయణన్ శ్రీ గణేష్ పేరును ఖరారు చేస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే ఆదేశాల మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నారాయణన్ శ్రీ గణేష్ ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో కంటోన్మెంట్ స్థానం ఖాళీ అయింది.

Also Read : Komatireddy Venkat Reddy : కేసీఆర్ జైలుకు పోవడం ఖాయం- మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

శ్రీగణేష్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి రెండో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో శ్రీ గణేష్ కు 41,888 ఓట్లు రాగా, లాస్య నందితకు 59,057 ఓట్లు పోలయ్యాయి. దీంతో 17, 169 ఓట్ల తేడాతో లాస్య నందిత విజయం సాధించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గద్దర్ కుమార్తె వెన్నల పోటీ చేసి ఓడిపోయారు. బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఫిబ్రవరి 23న పటాన్ చెరులోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఆమె మృతితో కేంద్ర ఎన్నికల సంఘం కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు తేదీని ప్రకటించింది. మే 13న పోలింగ్ జరగనుండగా.. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఇటీవల బీఆర్ఎస్ ముఖ్యనేతలను లాస్య నందిత కుటుంబ సభ్యులు కలిశారు. వారి ఫ్యామిలీలోని వారికే మరోసారి బీఆర్ఎస్ టికెట్ దక్కే అవకాశం ఉంది.