Komatireddy Venkat Reddy : కేసీఆర్ జైలుకు పోవడం ఖాయం- మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ అవినీతి అక్రమాలకు కాళేశ్వరం పరాకాష్ట. అధికారం పోయిందనే ఆవేదనలో కేసీఆర్ ఉన్నారు

Komatireddy Venkat Reddy : కేసీఆర్ జైలుకు పోవడం ఖాయం- మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జైలుకు పోవడం ఖాయం అని ఆయన అన్నారు. కాళేశ్వరం అవినీతిపై లెక్క తేలాలని అన్నారు. లక్ష అబద్ధాలు ఆడి కేసీఆర్ పదేళ్లు పాలించారని మండిపడ్డారు. కేసీఆర్ ఆస్తులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

”కూతురు కవిత జైలుకి పోయిందని కేసీఆర్ ఫ్రస్టేషన్ లో ఉన్నారు. కుక్కలు, నక్కలు అని మమ్మల్ని తిట్టొచ్చు. కేసీఆర్ అవినీతి ఆస్తులు జప్తు చేసి జనాలకు పంచుతాం. కాళేశ్వరం అవినీతిపై క్యాబినెట్ తీర్మానం చేసి సీబీఐ ఎంక్వైరీ కోరతాం. డబుల్ బెడ్ రూమ్ ల గురించి అడిగితే.. నన్ను శాసనసభ నుంచి బయటకు పంపారు. నేను తప్పు చేస్తే నన్ను జైలుకు ఎందుకు పంపలేదు? నేను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంటే నిప్పు” అని కోమటిరెడ్డి అన్నారు.

మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..
కేసీఆర్ అవినీతి అక్రమాలకు కాళేశ్వరం పరాకాష్ట. అధికారం పోయిందనే ఆవేదనలో కేసీఆర్ ఉన్నారు. ఇప్పటికే కొన్ని గ్యారంటీలను అమలు చేశాం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మిగిలిన గ్యారంటీలను అమలు చేస్తాం.

Also Read : అసెంబ్లీ రిజల్ట్‌ రిపీట్‌ అవుతుందా? చేవెళ్ల ఎంపీ స్థానంలో ముక్కోణపు పోరు