Triple Murder Case : జగిత్యాల ట్రిపుల్‌ మర్డర్‌ కేసులో సంచలన విషయాలు.. కుల సంఘం భవనంలోనే హత్యకు ప్లాన్‌

నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను హత్య చేస్తే ఎదురయ్యే పరిణామాలను కూడా ఫేస్ చేసేందుకు ప్రత్యర్థులు ముందుగానే ప్లాన్‌ చేశారంటే.. ఎంత పకడ్బందీగా పథకం రచన జరిగిందో అర్థం చేసుకోవచ్చు.

Jagitya’s triple murder case : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జగిత్యాల త్రిపుల్‌ మర్డర్‌ కేసులో రోజురోజుకు కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. వాస్తవానికి నాగేశ్వరరావు, ఆయన కుమారులు రాంబాబు, రమేశ్‌లను మట్టుబెట్టడానికి కుల సంఘం సభ్యులే స్కెచ్‌ వేసినట్టు దర్యాప్తులో తేలింది. కుల సంఘం భవనంలోనే హత్యకు ప్లాన్‌ చేసినట్టు వెలుగులోకి వచ్చింది. ఈ నెల 19న నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు కుల సంఘం భవనం వద్దకు వస్తారని తెలుసుకుని ప్రత్యర్థులు హత్యకు వ్యూహం రచించారు.

నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను హత్య చేస్తే ఎదురయ్యే పరిణామాలను కూడా ఫేస్ చేసేందుకు ప్రత్యర్థులు ముందుగానే ప్లాన్‌ చేశారంటే.. ఎంత పకడ్బందీగా పథకం రచన జరిగిందో అర్థం చేసుకోవచ్చు. హత్యలు జరిగిన తర్వాత కేసులు ఎదుర్కొనేందుకు కుల సంఘం పెద్దలు 40 లక్షల రూపాయల విరాళాన్ని ముందుగానే సేకరించి పెట్టుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. నిందితులను అరెస్టు చేస్తే కోర్టు నుంచి బెయిల్‌ తెచ్చుకునేందుకు వీలుగా విరాళాలను జమ చేసినట్టు తెలుస్తోంది.

Constable Suspend : చిత్తూరు మహిళపై దాడి ఘటనలో కానిస్టేబుల్ సస్పెన్షన్

నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు.. వారి కుల సంఘానికి కోటిన్నర రూపాయల వరకు అప్పులు ఇచ్చారు. వాటి కోసం వేధించడంతో పాటు మంత్రాలతో మానసికంగా హింసించినట్టు ఆరోపణలున్నాయి. అయితే నాగేశ్వరరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను తప్పిస్తే…. తీసుకున్న డబ్బులు తిరిగి కట్టాల్సిన అవసరం లేకపోవడంతో పాటు వేధింపుల నుంచి కూడా బయటపడొచ్చని… కులసంఘం భావించింది.

తీసుకున్న అప్పును నాగేశ్వరరావుకు ఇవ్వకుండా కుల సంఘానికి చెల్లిస్తే.. కేసులు, బెయిల్‌ ఖర్చుల కోసం ఉపయోగపడతాయని తీర్మానం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే 10 మందికిపై అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. నాగేశ్వరరావు, అతని ఇద్దరు కొడుకులు రాంబాబు, రమేశ్‌లను హతమార్చేందుకు నెల క్రితమే అతని ప్రత్యర్థులు ప్లాన్‌ చేసినట్టు వెలుగులోకి వచ్చింది.. గతేడాది డిసెంబర్ 17న అగ్రహారం స్మశానవాటిక సమీపంలో తండ్రీకొడుకులపై దాడి జరిగింది.

Police Attacked Woman : చిత్తూరులో ‘జై భీమ్‌’ సినిమా తరహా ఘటన.. విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు పిలిచి మహిళపై దాడి

వారు ప్రయాణిస్తున్న కారుపై కత్తులు, గొడ్డళ్లతో ప్రత్యర్థులు దాడి చేసింది. అదే రోజు గాయాలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది నాగేశ్వరరావు కుటుంబం. కానీ తమపైనే దాడి జరిగిందని నాగేశ్వరరావు కుటుంబంపై ప్రత్యర్థివర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది . ఇవన్నీ చూస్తుంటే నాగేశ్వరరావు కుటుంబంపై ఎప్పటినుంచో పగ పెంచుకున్న ప్రత్యర్థి వర్గం.. పక్కా ప్లాన్ ప్రకారమే అతని కుటుంబాన్ని కడతేర్చిందని చర్చ జరుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు