Constable Suspend : చిత్తూరు మహిళపై దాడి ఘటనలో కానిస్టేబుల్ సస్పెన్షన్

మహిళపై దాడి ఘటనలో కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు పడింది. కానిస్టేబుల్ సురేష్ బాబును ఎస్పీ సస్పెండ్ చేశారు. ఏఎస్పీ మహేశ్ ఆధ్వర్యంలో తదుపరి విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు.

Constable Suspend : చిత్తూరు మహిళపై దాడి ఘటనలో కానిస్టేబుల్ సస్పెన్షన్

Conistable Suspend

police Attack on a woman in Chittoor : చిత్తూరు జిల్లాలో విచారణ పేరుతో పోలీసులు మహిళను పోలీస్ స్టేషన్ కు పిలిచి తీవ్రంగా కొట్టి, చిత్ర హింసలకు గురిచేయడంపై 10 టీవీలో కథనం ప్రసారం అయింది. మహిళపై దాడి ఘటనకు సంబంధించి 10టీవీలో ప్రసారమైన కథనంపై జిల్లా ఎస్పీ స్పందించారు. మహిళపై దాడి ఘటనలో కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు పడింది. కానిస్టేబుల్ సురేష్ బాబును ఎస్పీ సస్పెండ్ చేశారు. ఏఎస్పీ మహేశ్ ఆధ్వర్యంలో తదుపరి విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు.

చిత్తూరులో జై భీమ్‌ తరహా ఘటన జరిగింది. చేయని తప్పుకు పోలీసులు తనను చిత్ర హింసలు పెట్టారని ఓ మహిళ ఆరోపిస్తోంది. చిత్తూరు జిల్లా జైలు సూపరిండెంట్‌ వేణుగోపాల్‌ రెడ్డి ఇంట్లో పనిమనిషిగా ఉన్న బాధితురాలిపై కుటుంబ సభ్యులు చోరి నేరం మోపారు. ఈ నెల 18న వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో 2 లక్షల రూపాయలు మాయం అయ్యాయి. ఈ డబ్బును బాధితురాలే తీసిందంటూ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Police Attacked Woman : చిత్తూరులో ‘జై భీమ్‌’ సినిమా తరహా ఘటన.. విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు పిలిచి మహిళపై దాడి

దీంతో పోలీసులు విచారణకు పిలిచారు. విచారణ పేరుతో తనను కొట్టారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. తీవ్రంగా కొట్టి… చివరకు నేరం రుజువు కాకపోవడంతో తనను వదిలి వేశారని బాధితురాలు చెబుతోంది. ప్రస్తుతం తాను కనీసం నడవలేని పరిస్థితుల్లో ఉన్నానంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. విన్నారుగా.. చేయ్యని నేరానికి బాధితురాలు శిక్ష అనుభవించింది. ఈ ఘటన జరిగి ఇన్ని రోజులైనా ఆమె ఇంకా కోలుకులేదంటే పోలీసుల ట్రీట్‌మెంట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

బయట నోరు తెరవద్దు, ఆసుపత్రి ఖర్చులు కూడా తామే ఇస్తామని సుమతి శతకాలు చెప్పిన ఖాకీలు పీఎస్‌ దాటగానే ఆ విషయం మర్చిపోయారు. చచ్చి చేడి బాధితురాలే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటే అక్కడికి కూడా వచ్చారని బాధితురాలు అంటోంది. పోలీసులు చేసిన నిర్వాకానికి తాను ఇప్పుడు నడిచే పరిస్థితిలో లేనంటోంది బాధితురాలు. చేయ్యని నేరానికి తనను హింసించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్‌ చేస్తోంది. ఈ ఘటన సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.

Murdered : భార్యపై అనుమానం.. ఇద్దరి ప్రాణాలు తీసింది

అదీ పోలీసుల వరుస. బాధితురాలిపై దొంగతనం ఆరోపణలు ఉన్నాయి.. విచారణనకు పిలిచారు. అక్కడి వరకు బాగానే ఉంది. మరి ఆమెపై చేయి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? పనిమనిషే కదా అని చులకనా? ఏం చేసినా అడిగే వారు లేరన్న ధైర్యమా? ఓ మహిళను విచారించేప్పుడు లేడీ కానిస్టేబుల్ అక్కడ ఎందుకు లేదు? మగ కానిస్టేబులే ఎందుకు విచారణ జరపాల్సి వచ్చింది? ఇంతకీ ఆ 2 లక్షలు ఎక్కడ దొరికాయి? ఈ కేసులో బాధితురాలిని కావాలనే ఇరికించారా? వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చిత్తూరు పోలీసులపై ఉంది.