SAGY List: ఆదర్శ గ్రామాల జాబితాలో 10లో 7 తెలంగాణవే, ఏఏ గ్రామాలంటే!

ఇటీవల విడుదల చేసిన సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన (SAGY) జాబితాలో పదింటిలో ఏడూ గ్రామాలూ తెలంగాణ రాష్ట్రం నుంచే చోటు దక్కించుకున్నాయి

SAGY List: ఆదర్శ గ్రామాలలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది తెలంగాణ రాష్ట్రం. ఇటీవల విడుదల చేసిన సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన (SAGY) జాబితాలో పదింటిలో ఏడూ గ్రామాలూ తెలంగాణ రాష్ట్రం నుంచే చోటు దక్కించుకున్నాయంటే.. తెలంగాణ గ్రామాల్లో అభివృద్ధి ఏ విధంగా ఉందో తెలుస్తుంది. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన(SAGY) కార్యక్రమంలో భాగంగా.. దేశంలోని గ్రామాల్లో సామాజిక అభివృద్ధి, సాంస్కృతిక అభివృద్ధి మరియు గ్రామ సంఘాల ఐక్యత, సామాజిక సమీకరణపై ప్రజలలో చైతన్యం పెంపొందించడం సహా పలు అంశాలను పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ జాబితాను ప్రకటిస్తుంది. ఈక్రమంలో ఇటీవల ప్రకటించిన జాబితాలో మొదటి పది స్థానాల్లో ఏడూ గ్రామాలూ తెలంగాణ రాష్ట్రానికే చెందినవే చోటు సంపాదించాయి.

Also read: Swami Paripurnananda: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాలసర్పం మధ్య చిక్కుకుంది: పరిపూర్ణానంద

ఆదర్శ గ్రామాల జాబితాలో కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం వెన్నంపల్లి గ్రామం దేశంలోనే మొదటి స్థానాన్ని దక్కించుకుంది. 2వ స్థానంలో నిజామాబాద్‌ జిల్లా జుక్కల్‌ మండలంలోని కౌలాస్‌ గ్రామం, 4వ స్థానంలో కరీంనగర్‌ జిల్లా బెజ్జంకి మండలంలోని గన్నేరువరం, 5వ స్థానంలో నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలంలోని కందకుర్తి, 6వ స్థానంలో కరీంనగర్‌ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని వీర్నపల్లి, 9వ స్థానంలో వీణవంక మండలంలోని రామకృష్ణాపూర్‌, 10వ స్థానంలో నిజామాబాద్‌ జిల్లాలోని తాణాకుర్ద్‌ గ్రామాలు చోటు సంపాదించాయి. ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే మొత్తం 5 గ్రామాలు ఈ జాబితాలో చోటు సంపాదించగా, నిజామాబాదు జిల్లా నుంచి 3 గ్రామాలు ఉన్నాయి.

Also read: Hyundai Cars India: దెబ్బకు దిగొచ్చిన హ్యుండయ్, క్షమాపణలు చెబుతూ ట్వీట్

పట్టణాలకు ధీటుగా పల్లెల్లో సౌకర్యల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన(SAGY) కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా పలువురు ఎంపీలు దేశవ్యాప్తంగా 2,598 గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజలకు ఉపాధి కల్పన, పచ్చదనం పెంపొందించడం వంటి పలు అంశాల్లో అభివృద్ధి సాధించిన గ్రామాలకు ప్రోత్సాహకాలు అందించడంతోపాటు, ఎస్‌ఏజీవై కింద ఆదర్శ గ్రామాలుగా ప్రకటిస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 248 ఆదర్శ గ్రామాలను ప్రకటించగా.. తొలి పది గ్రామాల్లో 7, తొలి 20 గ్రామాల్లో 11 గ్రామాలు తెలంగాణ నుంచే ఉన్నాయి.

Also read: Aamir Khan: వాగ్దానం మర్చిపోయిన అమీర్ ఖాన్, కష్టాల సుడిగుండంలో చేనేత కుటుంబం

ట్రెండింగ్ వార్తలు