Swami Paripurnananda: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాలసర్పం మధ్య చిక్కుకుంది: పరిపూర్ణానంద

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాల సర్పం మధ్య చిక్కుకుందని స్వామి పరిపూర్ణానంద అన్నారు. పాము తన గుడ్డును తానే తినేసేలా ఏపీలో పరిస్థితులు ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

Swami Paripurnananda: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాలసర్పం మధ్య చిక్కుకుంది: పరిపూర్ణానంద

Paripurnanada

Updated On : February 7, 2022 / 7:31 AM IST

Swami Paripurnananda: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాల సర్పం మధ్య చిక్కుకుందని స్వామి పరిపూర్ణానంద అన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..రాష్ట్రంలో స్వాధీనం పోయి పరాదీనంలో ఉందని.. అధికార పార్టీని ఉద్దేశించి అన్నారు. రాష్ట్రం పరాదీనత నుండి స్వాధీనంలోకి మారాలని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ అంశాన్ని తీసుకున్నా.. అందులో భవిష్యత్తు కనిపించడం లేదని పరిపూర్ణానంద అన్నారు. పాము తన గుడ్డును తానే తినేసేలా ఏపీలో పరిస్థితులు ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాలసర్పం మధ్య చిక్కుకుందన్న పరిపూర్ణానంద.. కాల సర్పం చేతినుండి బైటపడేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

Also read: Hyundai Cars India: దెబ్బకు దిగొచ్చిన హ్యుండయ్, క్షమాపణలు చెబుతూ ట్వీట్

మతమార్పిడిల నిరోధానికి బిల్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగామని.. ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. ప్రభుత్వాలకు పాలకులకు చిత్త శుద్ది లేదని.. పరిపూర్ణానంద మండిపడ్డారు. ప్రజలు తమ ప్రభుత్వాన్ని తామే ఎన్నుకోవాలని.. మరో సంవత్సర కాలంలో ఆ అవకాశం వస్తుందని తెలిపారు. మఠాలు, పిఠాలు ప్రభుత్వం చేతుల్లోకి వెలిపోయాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. పిఠాదిపతులు ప్రభుత్వం మాట వినాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాల నుంచి పీఠాలను మఠాలను రక్షించుకునేందుకు రాష్ట్రంలో మేదావులంతా ఒక్క త్రాటిపైకి రావాలని పరిపూర్ణానంద పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా సమాలోచనకు నాంది పలకిందన్న పరిపూర్ణానంద ప్రతీ గ్రామంలో సమాలోచన జరగాలని అన్నారు.

Also read: Statue of Equality : శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు.. ఆరో రోజు, దివ్య దేశాలకు ప్రాణప్రతిష్ట