Statue of Equality : శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు.. ఆరో రోజు, దివ్య దేశాలకు ప్రాణప్రతిష్ట

సోమవారం పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దృష్టి దోష నివారణకు వైయ్యూహి కేష్టియాగం నిర్వహించనున్నారు. వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మ జీవనానికి శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి...

Statue of Equality : శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు.. ఆరో రోజు, దివ్య దేశాలకు ప్రాణప్రతిష్ట

Samatamurthi

Sri Chinna Jeeyar Swamy : ముచ్చింతల్‌లో భగవత్‌ శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం వేడుకల్లో భాగంగా 2022, ఫిబ్రవరి 07వ తేదీ సోమవారం పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దృష్టి దోష నివారణకు వైయ్యూహి కేష్టియాగం నిర్వహించనున్నారు. వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మ జీవనానికి శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించనున్నారు. వీటితోపాటు ప్రముఖులచే ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగనున్నాయి. ఉదయం 9 గంటలకు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి వారు యాగశాల నుంచి రుత్విక్కులతో కలిసి ర్యాలీగా సమతామూర్తి ప్రాంగణానికి వస్తారు. అనంతరం సమతామూర్తి ప్రాంగణంలోని దివ్య దేశాలకు ప్రాణ ప్రతిష్ట చేస్తారు.

Read More : No Work From Home:వర్క్ ఫ్రమ్ హోమ్ రద్దు.. ఆఫీసులకు రావల్సిందే.. కేంద్రం ఆదేశాలు!

ఉదయం 6.30 కి అష్టాక్షరీ మంత్ర పఠనం.
ఉదయం 8.30 కి శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞ హోమం.
ఉదయం 9 గంటలకు దివ్య దేశాల్లోని 26 ఉత్సవ మూర్తులకు ప్రాణ ప్రతిష్ట.
ఈ కార్యక్రమానికి చిన్న జీయర్ స్వామి యాగ శాల నుంచి ఋత్విజులతో కలిసి ర్యాలీగా వెళ్తారు.

Read More : Medha group : తెలంగాణలో ప్రైవేటు రైల్ కోచ్ ఫ్యాక్టరీ సిద్ధం

ఉదయం 10 గంటలకు ఇష్ఠిశాలలో ‌దృష్టి దోష నివారణకు వైయ్యూహికేష్టి యాగం.
10.30 కి ప్రవచన మండపంలో శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామావళి పూజ.
మధ్యాహ్నం 12.30కి పూర్ణాహుతి.
సాయంత్రం 5 గంటలకు శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞ హోమం.
సాయంత్రం 5 గంటలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఉత్సవాల్లో పాల్గొంటారు.
రాత్రి 9 గంటలకు పూర్ణాహుతి.