Revanth Reddy : పోలీసుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన రేవంత్ రెడ్డిపై పలు కేసులు న‌మోదు

ఆగస్టు14న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొంతమంది నేతలు హైదరాబాద్ లోని గాంధీభవన్ వేదికగా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Revanth Reddy : పోలీసుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన రేవంత్ రెడ్డిపై పలు కేసులు న‌మోదు

Revanth Reddy

Updated On : August 15, 2023 / 4:23 PM IST

Police Cases Against Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పలు కేసు నమోదు అయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ పలు పోలీసు స్టేషన్లలో రేవంత్ రెడ్డిపై కేసులు నమోదు అయ్యాయి. భూత్పూర్ పోలీస్ స్టేషన్ లో సీఆర్.నెం.184/2023, యు/ఎస్ 153,504, 505 (2), 506 ఐపీసీ సెక్లన్లు, జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో సీఆర్ నెం.499/2023, యూ/ఎస్ 153, 504,505(2), 506ఐపీసీ సెక్షన్ల కింద రేవంత్ రెడ్డిపై కేసులు నమోదు అయ్యాయి.

ఆగస్టు14న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొంతమంది నేతలు హైదరాబాద్ లోని గాంధీభవన్ వేదికగా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక్కొక్కడిని గుడ్డలూడదీసి కొడతానని పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కొంతమంది పోలీసుల పేర్లను తన డైరీలో రాసి పెట్టుకుంటున్నానని తెలిపారు.

Revanth Reddy: కాంగ్రెస్‌లో చేరిన మరింత మంది బీఆర్ఎస్ నేతలు.. రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?

మరోవైపు ఆయా జిల్లాల పోలీసు అధికారుల అసోసియేషన్ లు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. ఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినా తాము చట్టానికి, న్యాయ స్థానాలకు లోబడి పనిచేస్తామని చెప్పారు. ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. భవిష్యత్ లోనైనా పోలీసు వ్యవస్థను విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు.