Shamshabad: ఫెరారీ.. రేంజ్ రోవర్ కార్లు అద్దెకు కావాలా.. గంటకు రూ.5వేలు
ఎయిర్ పోర్టు నుంచి నేరుగా లగ్జరీ కార్లలో క్యాబ్ సర్వీస్ పొందొచ్చు. ఫెరారీ, లంబోర్గిని, రేంజ్ రోవర్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో..

Shamshabad Ferrari Range Rover Cars For Rent
Shamshabad: ఎయిర్ పోర్టు నుంచి నేరుగా లగ్జరీ కార్లలో క్యాబ్ సర్వీస్ పొందొచ్చు. ఫెరారీ, లంబోర్గిని, రేంజ్ రోవర్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో ఉన్న పారిశ్రామిక వేత్తలు వాడే కార్లను ఈ సర్వీసుకు కేటాయించడం సాహసోపేతమైన పనే. ఈ సేవలు శంషాబాద్ లోనే మొదలుకానున్నాయి. ఆ సేవలు ఎంత కాస్ట్రీయో తెలుసా.. రూ. 4.97 కోట్లు పలికే ఫెరారీ కంపెనీ కారు.
దేశంలో ఏ విమానాశ్రయంలోనూ అందుబాటులోని లేని సేవలను శంషాబాద్‌లో 4 వీల్స్ ట్రావెల్స్, డ్రైవెన్ బై యూ మొబిలిటీ, అర్బన్ ఓయాసిస్ సంస్థలు సంయుక్తంగా ఏప్రిల్ నుంచి అందుబాటులోకి తీసుకువచ్చాయి. విమానం దిగిన ప్రయాణికులు అరైవల్ వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా లేదంటే.. రిజర్వేషన్ ఎట్ అర్బన్ ఓయాసిస్.ఇన్ వెబ్‌సైట్‌లో ఈ లగ్జరీ కార్లను బుకింగ్ చేసుకోవచ్చు.
గంటకు అద్దె రూ. 5వేలు
బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారులో సెల్ఫ్ డ్రైవింగ్‌తో ప్రయాణించాలంటే ముందుగా లక్ష రూపాయలు డిపాజిట్ చెల్లించాల్సిందే. గంటకు రూ. 5 వేల చొప్పున అద్దె, 10 కి.మీ. తర్వాత కి.మీకు రూ. 177 చొప్పున అదనంగా ఛార్జీ చెల్లించాలి.
లంబోర్గిని కారులో డ్రైవర్‌తో 10 కి.మీ. ప్రయాణించడానికి రూ.22 వేలు చెల్లించాలి. ఆ తర్వాత ప్రతి కి.మీకు రూ. 706, గంటకు రూ. 22 వేల చొప్పున అదనంగా వసూలు చేస్తారు. ఇందులో డ్రైవర్‌కు రూ.వెయ్యి బత్తా కూడా చెల్లించాల్సి ఉంటుంది.
అందుబాటులో కార్లు ఇవే..
లంబోర్గిని, ఫెరారీ, రేంజ్‌రోవర్, మెర్సిడెస్ బెంజ్, ఫోర్డ్ ముస్తాగ్, జాగ్వార్, ఆడి, వోల్వో, టయోటా, బీఎండబ్ల్యూ, బెంట్లీ కాంటినెంటల్, పోర్షే 911 కంపెనీలకు చెందిన 30కి పైగా మోడల్స్ కార్లు ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.