YS Sharmila : మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది.. కొడుకు, కుమార్తెను అభినందిస్తూ ఎమోషనల్ ట్వీట్ చేసిన షర్మిల

వైఎస్ఆర్టీపీ అధినేత్రి వై.ఎస్.షర్మిల ఎక్స్ (ట్విటర్)లో ఆసక్తికర ట్వీట్ చేశారు. తన కుమార్తె, కుమారుడు గురించి చెబుతూ సంతోషం వ్యక్తం చేశారు.

YS Sharmila

YS Sharmila Tweet : వైఎస్ఆర్టీపీ అధినేత్రి వై.ఎస్.షర్మిల ఎక్స్ (ట్విటర్)లో ఆసక్తికర ట్వీట్ చేశారు. తన కుమార్తె, కుమారుడు గురించి చెబుతూ సంతోషం వ్యక్తం చేశారు. నా అద్భుతమైన పిల్లలిద్దరూ విద్యా మైలురాళ్లను ప్రకటించడం నాకెంతో సంతోషంగా ఉందని చెప్పారు. షర్మిల చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : Pallavi Prashanth : ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో పల్లవి ప్రశాంత్..? పోలీసుల గాలింపు..? క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్..

షర్మిల ట్వీట్ ప్రకారం.. నా అద్భుతమైన ఇద్దరు పిల్లల విద్యా మైలురాళ్లను ప్రకటించడం సంతోషంగా ఉంది. ఎకనామిక్స్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని సాధించినందుకు నా కుమారుడు రాజారెడ్డికి, అదేవిధంగా బీబీఏ ఫైనాన్స్ డిగ్రీని సంపాదించినందుకు నా కుమార్తె అంజిలీ రెడ్డికి హృదయపూర్వక అభినందనలు. మీరు చాలా త్వరగా ఉన్నతస్థానాలకు ఎదిగారని షర్మిల అన్నారు. వాళ్లిద్దరి గురించి చెప్పడం చాలా గర్వంగా ఉదంటూ పేర్కొన్నారు.

Also Read : Telangana Assembly 2023 : అసెంబ్లీలో 42 పేజీల శ్వేతపత్రం విడుదల చేసిన ప్రభుత్వం.. రాష్ట్రం అప్పులు ఎన్నంటే?

డిగ్రీ పట్టాలు సాధించిన కుమార్తె, కుమారిడికి షర్మిల పలు సూచనలు చేశారు. ధైర్యం, నిజాయితీ కలిగిన హృదయాలతో మీరు ముందుకెళ్లండి. సత్యాన్ని గ్రహించండి.. సమగ్రతతో కూడిన జీవితాన్ని స్వీకరించండి. మీరు మీ లక్ష్యాలను చేరుకునేటప్పుడు మీ చుట్టూ ఉన్నవారిని గౌరవించండి. ఇతరుల ఆశీర్వాదం తీసుకొని వారిపట్ల గౌరవంగా ఉండండి అంటూ షర్మిల ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ లో కుమార్తె అంజిలీ రెడ్డి, కొడుకు రాజారెడ్డి డిగ్రీ పట్టాలు అందుకున్న సమయంలో వారితో కలిసి ఉన్న ఫొటోలను షర్మిల ట్వీట్ చేశారు. ఈ ఫొటోల్లో షర్మిల, బ్రదర్ అనిల్, విజయమ్మ ఉన్నారు.