Shilpa Chaudhary: శిల్ప చౌదరికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు

కిట్టీ పార్టీలు, పెట్టుబడుల పేరుతో కోట్లు కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న శిల్ప చౌదరికి బెయిల్ వచ్చింది.

Shilpa Chaudhary: శిల్ప చౌదరికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు

Shilpa Chowdary

Updated On : December 23, 2021 / 6:32 PM IST
Shilpa Chaudhary: కిట్టీ పార్టీలు, పెట్టుబడుల పేరుతో కోట్లు కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న శిల్ప చౌదరికి బెయిల్ వచ్చింది. పలుమార్లు బెయిల్ పిటిషన్‌లను కోర్టులు తిరస్కరించగా.. లేటెస్ట్‌గా రాజేంద్రనగర్ కోర్టు శిల్ప చౌదరికి షరుతులతో కుడిన బెయిల్ మంజూరు చేసింది.
ప్రతి శనివారం నార్సింగి పోలీస్టేషన్‌లో హజరై సంతకం చేయాలనే నిబంధనతో ఆమె బెయిల్ మంజూరైంది. రూ. 10వేల చొప్పున షురిటీలు కోర్టుకు సమర్పించాలని కోరింది కోర్టు. సమాచారం లేకుండా విదేశీ ప్రయాణం చేయొద్దని కూడా నిబంధన విధించింది కోర్టు.
ఎవరితోనూ ఫోన్‌లో కానీ, డైరెక్ట్‌‍గా కానీ, కేసు విషయం మాట్లాడకూడదని, సాక్షులను బెదిరించరాదని కోర్టు ఆదేశించింది. బెయిల్ మంజూరు కావడంతో శిల్ప చౌదరి రేపు మధ్యాహ్నం విడుదల కానుంది.
చిట్టీలు మొదలు కిట్టీ పార్టీల వరకు అనేక రంగాల్లో వేలు పెట్టిన శిల్పపై పెద్ద మొత్తాల్లో తమకు డబ్బులు చెల్లించాలంటూ చాలామంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.