Singareni Collieries : సింగరేణి ఉద్యోగులకు తీపికబురు.. పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంపు

సింగరేణి అధికారులు, కార్మికులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. పదవీ విరమణ వయసు 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ వయసు పెంపు నిర్ణయం ఈ ఏడాది మార్చి 31 నుంచి అమలులోకి రానుందని సీఎండీ శ్రీధర్ తెలిపారు.

Singareni Collieries : సింగరేణి అధికారులు, కార్మికులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. పదవీ విరమణ వయసు 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ వయసు పెంపు నిర్ణయం ఈ ఏడాది మార్చి 31 నుంచి అమలులోకి రానుందని సీఎండీ శ్రీధర్ తెలిపారు.

మార్చి తర్వాత రిటైర్ అయినవారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని శ్రీధర్ తెలిపారు. వయసు పెంపు వలన 43,899 మంది అధికారులు, కార్మికులకు లబ్దిచేసుకుంటుందని తెలిపారు.

కారుణ్య నియామకాలపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది సింగరేణి యాజమాన్యం. పెళ్ళైన, విడాకులు పొందిన కుమార్తెలకు కారుణ్య నియామకాల్లో అవకాశం దక్కనుంది.

ఇక సింగరేణి ఉద్యోగాల్లో 10 శాతం ఈబీసీ రిజర్వేషన్ అమలుకు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ అనుమతి తెలిపినట్లు సీఎండీ శ్రీధర్ తెలిపారు. సింగరేణిలో అన్ని ఉద్యోగాలకు లింగబేధం లేకుండా అవకాశాలకు అనుమతికి సమావేశం ఆమోదం తెలిపినట్లు వివరించారు. ఇక వయసు పెంపుపై ఉద్యోగులు, కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు