Telangana
Corona : రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. జులై వరకు కరోనా కేసులు 2 వేలకు అటు ఇటుగా నమోదయ్యాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఇక ఇదే విషయమై తెలంగాణ వైద్యారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్బంగా కరోనాకి సంబందించిన కీలక సమాచారాన్ని వెల్లడించారు. కోవిడ్ రికవరీ రేటు చాలా పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం కరోనా ముందు పరిస్థితిలు కనిపిస్తున్నాయని తెలిపారు. సాధారణ జీవనంలోకి వస్తున్నామని వివరించారు. ప్రజలు కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు కరోనా సోకని వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
Read More : Andhra Pradesh : కొత్తగా కరోనా కేసులు ఎన్నంటే
తగ్గింది కదా అని విచ్చల విడిగా తిరగొద్దని సూచించారు. పండుగ సీజన్ లో జాగ్రత్తగా ఉండాలని వివరించారు. పండుగలు.. విందులు.. షాపింగ్ సమయాల్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యలను సంప్రదించాలన్నారు. డిసెంబర్ వరకు మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరని, ప్రజలంతా మాస్క్‌లు ధరించాలని సూచించారు. ఇక రాష్ట్రంలో 60 శాతం మందికి మొదటి డోసు టీకా వితరణ పూర్తైందని.. 38 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారని తెలిపారు శ్రీనివాసరావు. ఇక ఇదిలా ఉంటే ఆదివారం రాష్ట్రంలో 162 కరోనా కేసులు నమోదు కాగా.. కరోనాతో ఒకరు మృతి చెందారు. 4235 మంది ప్రస్తుతం కరోనాతో చికిత్స పొందుతున్నారు.
Read More : Corona Cases : భారత్ లో తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు