Corona Cases : భారత్ లో తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

భారత్ లో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. దేశ వ్యాప్తంగా కొత్తగా 19,740 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి 248 మంది మరణించారు.

Corona Cases : భారత్ లో తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

Corona

corona cases in India : భారత్ లో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. దేశ వ్యాప్తంగా కొత్తగా 19,740 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి 24 గంటల్లో 248 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 2,36,643 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. 206 రోజుల కనిష్టానికి యాక్టీవ్ కేసులు చేరాయి. దేశంలో యాక్టివ్ కేసులు 0.70 శాతంగా ఉన్నాయి.

దేశంలో ఇప్పటివరకు 3,39,35,309 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 4,50,375 మంది మృతి చెందారు. దేశంలో రికవరీ రేటు 97.98 శాతంగా ఉంది. నిన్న 23,070 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 3,32,48,291 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో మార్చి 2020 తరువాత రికవరీ కేసుల శాతం భారీగా పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది.

Maoists Booby Traps : మావోయిస్టుల బూబీ ట్రాప్ లను నిర్వీర్యం చేసిన పోలీసులు

భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ 267 రోజులుగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 93.99 కోట్ల డోసుల టీకాలు అందజేశారు. నిన్న 79,12,202 డోసుల టీకాలు ఇచ్చారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 93,99,15,323 డోసుల టీకాలు అందజేశారు.