SLBC టన్నెల్ ఘటనలో మరో మృతదేహం వెలికితీత

నాగర్ కర్నూల్ జిల్లాలోని ఎస్ఎల్ బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

SLBC టన్నెల్ ఘటనలో మరో మృతదేహం వెలికితీత

SLBC tunnel incident

Updated On : March 25, 2025 / 2:43 PM IST

SLBC Tunnel Rescue: నాగర్ కర్నూల్ జిల్లాలోని ఎస్ఎల్ బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో మృతదేహాన్ని గుర్తించిన అధికారులు ఇవాళ ఉదయం వెలికితీశారు. అనంతరం నాగర్ కర్నూల్ ప్రభుత్వాస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. మృతుడిని టీబీఎం మిషన్ ఇంజనీర్ మనోజ్ కుమార్ గా గుర్తించారు. లోకో ట్రైన్ శిథిలాల కింద డెడె బాడీని గుర్తించిన రెస్క్యూ బృందాలు.. తవ్వకాలు చేపట్టాయి. ఘటన స్థలం నుంచి మృతదేహాన్ని లోకో ట్రైన్ ద్వారా బయటకు తీసుకొచ్చారు.

 

గత నెల ఎస్ఎల్ బీసీ టన్నెల్ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వీరి ఆచూకీ కోసం దేశంలోని అన్ని ప్రముఖ రెస్క్యూటీంలను రంగంలోకి దింపారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్, కేరళ కేడావర్ డాగ్స్ స్వ్కాడ్ వంటి వాటితో రెస్క్యూ చేపట్టారు. గత పదిహేను రోజుల క్రితం గురుప్రీత్ సింగ్ అనేక కార్మికుడి మృతదేహం లభ్యమైంది. తాజాగా.. మరో మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది వెలికి తీశారు. మృతుడిని టీబీఎం మిషన్ ఇంజనీర్ మనోజ్ కుమార్ గా గుర్తించారు.

 

ఈ ఘటనలో మొత్తం 8మంది కార్మికులు గల్లంతు కాగా.. ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఆరుగురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.