Snake Catcher Died
Telangana : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మణుగూరు మండలం సమితి సింగారంలో పాములు పట్టె షరీఫ్ నాగరాజు అనే వ్యక్తి పాము కాటుతో మృతి చెందాడు.
సమితి సింగారం గ్రామంలో ఎలక్ట్రీషియన్ గా పని చేసే షరీఫ్ పాములు పడుతూ ఉంటాడు. ఈ రోజు మధ్యాహ్నం గ్రామం లోని ఓ బావిలో త్రాచు పాము కనపడింది. సమాచారం అందుకున్న షరీఫ్ బావి వద్దకు వచ్చి పామును బావిలోంచి బయటకు తీసాడు. ఆ తర్వాత దానితో ఆటలాడుతుండగా అది చేతిపై కాటు వేసింది.
అయినా లెక్క చేయకుండా దాన్ని గంట సేపు ఆడించి .. అనంతరం తీసుకువెళ్లి సమీపంలోని అడవిలో వదిలేసి వచ్చాడు. పాము కాటువేసిన సంగతి తెలిసిన అతని స్నేహితులు ఆస్పత్రికి వెళ్లమని సూచించారు.
అప్పటికే మద్యం సేవించి ఉన్న షరీఫ్ వారి మాటలు వినలేదు.పామును అడవిలో విడిచిపెట్టి తిరిగివస్తున్న సమయంలో కుప్పకూలి చనిపోయాడు. దీంతో ఆ ప్రాంతమంతా విషాదంతో నిండిపోయింది.
Also Read : YS Jagan Mohan Reddy : ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ సీఎం జగన్ భేటి