తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు హాజరుకాలేకపోతున్న సోనియా గాంధీ

ఈ వేడుకలకు తన సందేశాన్ని పంపనున్నారు సోనియా గాంధీ. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా..

జూన్ 2న నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు ఆహ్వానించారు. అయితే, జూన్ 2 వేడుకలకు రావడం లేదని తెలంగాణ నేతలకు సోనియాగాంధీ కార్యాలయం సమాచారం ఇచ్చింది.

ఈ వేడుకలకు తన సందేశాన్ని పంపనున్నారు సోనియా గాంధీ. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీ వస్తారని కాంగ్రెస్ నేతలు భావించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఇప్పటికే సీఈసీ షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. సికింద్రాబాద్‌‌ లోని పరేడ్‌‌ గ్రౌండ్‌‌లో వేడుకలు నిర్వహించేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తోంది.

ఆ రోజున ముందుగా రేవంత్ రెడ్డి నాంపల్లిలోని గన్​పార్క్​ను సందర్శిస్తారు. తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తారు. ఆ రోజున పార్కింగ్ స్థలం, ట్రాఫిక్ రూట్ మ్యాప్​ ను పోలీసులు సిద్ధం చేస్తున్నారు.

ఈసీ ప్రభుత్వానికి అనుమతి ఇవ్వడంతో అందుకు తగ్గ ఏర్పాట్లపై అధికారులు మునిగారు. వేడుకకు వచ్చేవారు ఎండకు గురికాకుండా షామియానాలు ఏర్పాటు చేయనున్నారు. పండుగ వాతావరణాన్ని తలపించేట్లు కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు.

బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనూ..
బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనూ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు కౌంటర్ గా బీఆర్ఎస్ కార్యక్రమాలు రూపొందిస్తోంది. మూడు రోజుల పాటు నిర్వహించాలన్న యోచిస్తోంది. తెలంగాణ కోసం చేసిన పోరాటం, తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది.

నిందితులను ఆయన దాచి పెట్టారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ట్రెండింగ్ వార్తలు