నిందితులను ఆయన దాచి పెట్టారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ అన్నారు. శ్రీధర్ రెడ్డి హత్య ఘటనపై..

నిందితులను ఆయన దాచి పెట్టారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

RS Praveen Kumar

తాము డీజీపీని కలిసిన 10 రోజులకే కొల్లాపూర్‌లో రాజకీయ హత్య జరిగిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. శ్రీధర్ రెడ్డి హత్య జరిగి 48 గంటలైనా ఎవరిని పట్టుకోలేదని అన్నారు. బాధితుల ఫిర్యాదులో మంత్రి జూపల్లి కృష్ణారావు పేరు రాస్తే ఆయన పేరు తీసిన తరువాతే ఫిర్యాదు తీసుకున్నారని చెప్పారు.

జూపల్లి నైతిక విలువలు లేకుండా మాట్లాడుతున్నారని ప్రవీణ్ కుమార్ తెలిపారు. నిందితులను ఆయన దాచి పెట్టారని అన్నారు. పెద్దకొత్తపల్లిలో దళిత యువకులపై దాడి జరిగితే నిందితులపై చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. కొల్లాపూర్‌లో అరాచక పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ నేతలపై నియోజకవర్గంలో వరుసగా దాడులు జరుగుతున్నాయని ప్రవీణ్ కుమార్ చెప్పారు. ప్రతీకారానికి పాల్పడుతున్నారని తెలిపారు. పోలీసులు రాజ్యాంగాన్ని పట్టించుకోరా అని నిలదీశారు. బుల్డోజర్ల సంస్కృతిని రాష్ట్రానికి తెచ్చిన ఘనత జూపల్లికే దక్కుతుందని అన్నారు.

పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ అన్నారు. శ్రీధర్ రెడ్డి హత్య ఘటనపై సిట్ వేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి ఈ హత్యలకు బాధ్యత వహించాలని అన్నారు. ఎన్నికల కమిషన్ కూడా బీఆర్ఎస్ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని చెప్పారు.

Also Read : మందుబాబుల‌కు షాక్‌.. సాయంత్రం 4 గంట‌ల నుంచి మ‌ద్యం దుకాణాలు బంద్‌..