Telangana : మందుబాబుల‌కు షాక్‌.. సాయంత్రం 4 గంట‌ల నుంచి మ‌ద్యం దుకాణాలు బంద్‌..

తెలంగాణ రాష్ట్రంలోని మందుబాబుల‌కు బ్యాడ్ న్యూడ్‌.

Telangana : మందుబాబుల‌కు షాక్‌.. సాయంత్రం 4 గంట‌ల నుంచి మ‌ద్యం దుకాణాలు బంద్‌..

Graduate MLC byelection liquor shops closed from today evening in three districts

Updated On : May 25, 2024 / 11:32 AM IST

Liquor Shops Close in Telangana : తెలంగాణ రాష్ట్రంలోని మందుబాబుల‌కు బ్యాడ్ న్యూడ్‌. ఈ రోజు సాయంత్రం నుంచి రెండు రోజుల పాటు మ‌ద్యం దుకాణాలు మూసివేయ‌నున్నారు. అయితే.. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం కాదు.. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌, న‌ల్గొండ‌, ఖ‌మ్మం జిల్లాల్లో మాత్ర‌మే వైన్ షాపులు, మ‌ద్యం దుకాణాలు మూత ప‌డ‌నున్నాయి. ఎందుకంటే.. మే 27వ తేదీన ఉమ్మడి వరంగల్- నల్గొండ- ఖమ్మం జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది.

ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రులు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు. సోమ‌వారం రోజు పోలింగ్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ రోజు సాయంత్రం 4 గంట‌ల నుంచి మే 27 సోమ‌వారం సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు మ‌ద్యం దుకాణాలు, వైన్ షాపులు, బార్లు మూసివేయ‌నున్నారు. ఈ మేర‌కు ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

అర్థరాత్రి 1గంట వరకు విచారణ..! తెలంగాణ హైకోర్టులో అరుదైన ఘట్టం..

ఏర్పాట్లు పూర్తి..
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మొత్తం 4,61, 806 మంది ప‌ట్ట‌భ‌ద్రులు ఓట‌ర్లుగా న‌మోదు చేసుకున్నారు. సోమ‌వారం ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. నేటి (మే 25)తో ప్ర‌చారం ముగియ‌నుంది. జూన్ 5న ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.