Medaram Jatara 2026: మేడారానికి లక్షలాది మంది.. ఆ ప్రధాన రాహదారిపై 5 కి.మీ.కు పైగా ట్రాఫిక్ జామ్
గంటల తరబడి ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలు నిలిచిపోవడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ అధికారులులేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Medaram Jatara 2026 (Image Credit To Original Source)
- తాడ్వాయి మీదుగా జాతరకు వెళ్లే రహదారిపై ట్రాఫిక్ జామ్
- గంటల తరబడి ట్రాఫిక్ జామ్లోనే వాహనాలు
- రేపటితో ముగియనున్న మేడారం జాతర
Medaram Jatara 2026: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర జరుగుతున్న వేళ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తాడ్వాయి మీదుగా మేడారం వెళ్లే ప్రధాన రహదారిపై 5 కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ జామ్ నెలకొంది.
గంటల తరబడి ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలు నిలిచిపోవడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ అధికారులులేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమ్మక్క-సారలమ్మ జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
Also Read: కోట్లాది మంది భక్తులు షాక్ అయ్యారు.. మహా పాపం చేశానని చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి: సజ్జల
దీంతో ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాలు భారీగా వస్తుండడంతో రద్దీ విపరీతంగా పెరిగింది. ట్రాఫిక్ జామ్ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. కాగా, ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, సమ్మక్కను పూజారులు గద్దెలపైకి తీసుకొచ్చారు. జనవరి 28న ప్రారంభమైన మేడారం జాతర 31న ముగుస్తుంది.
మేడారం జాతరలో ఇవాళ అమ్మవార్లను తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించారు. అంతకముందు జిష్ణు దేవ్ వర్మకు తెలంగాణ మంత్రి సీతక్కతో పాటు పలువురు అధికారులు ఘన స్వాగతం పలికారు.
