Karimnagar : కన్నతల్లిని ఇంటి నుంచి బయటకు గెంటేసిన కొడుకులు… బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న వృద్ధురాలు

హిమ్మత్ నగర్ కు చెందిన సంగ మధురమ్మ, రాజయ్య దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు.

sons throw out mother

Sons Throw Out Mother : కరీంనగర్ జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. నవ మాసాలు మోసి కని పెంచిన కన్నతల్లిని కొడుకులు ఇంటి నుంచి బయటకు గెంటేశారు. ఈ ఘటన వీణవంక మండలం హిమ్మత్ నగర్ లో శనివారం చోటుచేసుకుంది. రోడ్డున పడ్డ ఆ వృద్ధురాలు న్యాయం కోసం వేడుకుంటోంది.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. హిమ్మత్ నగర్ కు చెందిన సంగ మధురమ్మ, రాజయ్య దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. భర్త రాజయ్యకు మహారాష్ట్రలో ఉద్యోగం రావడంతో అక్కడే స్థిరపడి పోయారు. ఎనిమిదేళ్ల క్రితం రాజయ్య మృతి చెందాడు.

Indian Railway Board : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ రైళ్లలో టికెట్ పై 25శాతం తగ్గింపు

ఇద్దరు కొడుకులకు సొంత ఖర్చులతో మహారాష్ట్రలో వ్యాపారాలు పెట్టించి, హిమ్మత్ నగర్ లో ఉన్న 10 ఎకరాల్లో చెరో 5ఎకరాలు పంచి ఇచ్చారు. ప్రస్తుతం మధురమ్మ హిమ్మత్ నగరలోని ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. అయితే, గత కొద్దిరోజులుగా కొడుకులు ఖర్చులకు డబ్బులు పంపడం లేదు.

తినడానికి తిండి లేక మధురమ్మ ఇంటింటికీ తిరుగుతూ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శనివారం ఉదయం మధురమ్మ కొడుకులు ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేసి తాళం వేసుకొని వెళ్లిపోయారు. దీంతో మధురమ్మ బతుకు రోడ్డన పడింది. తనకు న్యాయం చేయాలని బోరున విలపిస్తున్నారు.