Basara : బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో ఘనంగా శ్రీ శారదీయ శరన్నవరాత్రులు

అమ్మవారి ములానక్షత్రం కావడంతో చిన్నారులకు పెద్ద ఎత్తున అక్షరభ్యాసాలు చేస్తున్నారు. అమ్మవారి దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతోంది.

Basara Gnana Saraswati

Basara Gnana Saraswati : నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో శ్రీ శారదీయ శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. “కాత్యాయని” అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. మూలానక్షత్ర సరస్వతి పూజ – చతుషష్టి ఉపచార పూజలను అర్చకులు నిర్వహించారు. అమ్మవారికి మల్లె పుష్పార్చన-రవ్వ కేసరి నివేదన చేశారు. అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు.

భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. అర్ధరాత్రి నుండి భక్తులు క్యూలైన్ లో ఉన్నారు. అమ్మవారి ములానక్షత్రం కావడంతో చిన్నారులకు పెద్ద ఎత్తున అక్షరభ్యాసాలు చేస్తున్నారు. అమ్మవారి దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతోంది. భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

Indrakeeladri : విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా శరన్నవరాత్రులు.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్

ట్రెండింగ్ వార్తలు