Srinivas Goud : గత ఎన్నికల కంటే ఈసారి మరింత మెజారిటీ వస్తుంది : మంత్రి శ్రీనివాస్ గౌడ్

కాంగ్రెస్, బీజేపీ చేతుల్లో రాష్ట్రాన్ని పెడితే ఆగమవుతుందని ప్రజలు భయపడుతున్నారని వెల్లడించారు. ఎవరి పక్షాన నిలబడితే రాష్ట్రం బాగుంటుందనేది ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు.

Minister Srinivas Goud (1)

Srinivas Goud Cast to Vote : తెలంగాణ ప్రజలంతా గత పదేళ్ల క్రితం ప్రజలు అనేక సమస్యలతో ఓటెయ్యడానికి వెళ్లారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. అప్పుడు తాగునీరు, రోడ్లు, మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఓటెయ్యడానికి ప్రజలు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారని వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో బీఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అనంతరం శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. గత 70 ఏళ్ల సమస్యలను, ఇప్పుడు తీరిన సమస్యలను ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. అప్పటి వలస జీవితాలను, దుర్భర బతుకులను మననం చేసుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. తెలంగాణను ఆగం కాకుండా చూసుకోవాలని జనం ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు.

KTR : ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. తెలంగాణ ప్రగతికి పునాదిగా నిలవాలి : మంత్రి కేటీఆర్

కాంగ్రెస్, బీజేపీ చేతుల్లో రాష్ట్రాన్ని పెడితే ఆగమవుతుందని ప్రజలు భయపడుతున్నారని వెల్లడించారు. ఎవరి పక్షాన నిలబడితే రాష్ట్రం బాగుంటుందనేది ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. పదేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామని, ఇంకా సాధించాల్సి ఉందన్నారు. ఆపదలో అందరికీ అండగా ఉన్నామని తెలిపారు. మరోసారి అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

ప్రశాంతమైన మహబూబ్ నగర్ చేయడమే తమ ధ్యేయం అన్నారు. 10వేల మందికి ఉద్యోగాలను అందించే లిథియం అయాన్ గిగా పరిశ్రమ లాంటివి మరెన్నో తీసుకువస్తామని చెప్పారు. గత ఎన్నికల కంటే ఈసారి తమకు మరింత మెజారిటీ వస్తుందని భావిస్తున్నామని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు