సృష్టి ఫెర్టిలిటీ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పేద దంపతుల వద్ద ఫ్రీగా ఆడపిల్లలను తీసుకుంది డాక్టర్ నమ్రత. ఆడపిల్లలను పెంచే స్తోమత లేని దంపతుల వద్ద నుంచి ఏజెంట్ల ద్వారా తీసుకుని సరోగసి పేరుతో నమ్రత అమ్ముకుంది.
మగ పిల్లలైతే లక్ష రూపాయలకు కొనుగోలు చేసి సరోగసి పేరుతో అమ్మింది. తన వద్దకు వచ్చే దంపతులతో సరోగసి పేరుతో ట్రీట్మెంట్ ఇచ్చినట్లు నాటకం ఆడింది. ప్రతి నెల బిడ్డ ఎదుగుదలకు సంబంధించిన స్కానింగ్స్, ఇతర రిపోర్ట్స్ అన్నీ నకిలీవని పోలీసులు గుర్తించారు.
Also Read: అలర్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
“సరోగసి ద్వారా వేరే మహిళ గర్భంలో మీ బిడ్డ పెరుగుతున్నాడు” అంటూ ప్రతినెల చికిత్సకు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు వసూలు చేసింది డాక్టర్ నమ్రత. బిడ్డ పూర్తిగా ఆరోగ్యంగా జన్మించడానికి ప్రతినెల మందుల పేరుతో కూడా డబ్బులు వసూలు చేసింది.
ఒక్కొక్కరి దగ్గర నుంచి మొత్తం 35 నుంచి 50 లక్షల రూపాయల చొప్పున వసూలు చేసింది. సృష్టి ఫెర్టిలిటీ కేసులో దర్యాప్తు చేసిన కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.