అలర్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
ఎవరూ చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని అధికారులు హెచ్చరించారు.

దక్షిణ కోస్తాంధ్ర మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
ఎవరూ చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించింది. బుధవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో బుధ, గురువారల్లో దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Also Read: సీబీఎస్ఈ కీలక నిర్ణయం.. 9వ తరగతి వార్షిక పరీక్షల్లో ఓపెన్ బుక్ ఎగ్జామ్స్!
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో భిన్న వాతావరణ పరిస్థితి నెలకొంది. పలు ప్రాంతాల్లో ఎండ కనపడుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడుతుందని ఇప్పటికే ఐఎండీ అంచనా వేసింది.
మరోవైపు, తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌ను రెండు రోజులుగా వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచాయి.