Hyderabad : చార్మినార్ వద్ద సండే – ఫండే నిర్వహిస్తే ఎలా ఉంటుంది ?

చార్మినార్ ప్రాంతం వద్ద సండే - ఫండే కార్యక్రమం నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపై సలహాలు ఇవ్వాలని తాము నగర వాసులను కోరుతున్నట్లు సెక్రటరీ అరవింద కుమార్ వెల్లడించారు.

Sunday – Funday Charminar : హైదరాబాద్ ట్యాంక్ బండ్ ప్రతి సండే జరుగుతున్నట్లుగా ఇతర ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ట్యాంక్ బండ్ పై రాకపోకలపై నిషేధం విధించి..ప్రజలకు అనుమతినిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఫుల్ రెస్పాండ్ వస్తుండడంతో మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు అధికారులు. లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ స్టాల్, చిన్న పిల్లలు ఆడుకోవడానికి వీలుగా…హ్యాండ్ లూమ్ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు.

Read More : Noida : గే డేటింగ్ యాప్..నమ్మిస్తారు, అందినకాడికి దోచుకుంటారు

దీంతో చిన్నా..పెద్ద అనే తేడా లేకుండా..సండే వస్తే..చాలు ట్యాంక్ బండ్ పై వాలుతూ..ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా..ఇదే విధంగా చార్మినార్ ప్రాంతం వద్ద కూడా నిర్వహిస్తే ఎలా ఉంటుందనే మంత్రి కేటీఆర్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సూచించినట్లు అర్బన్ డెవలప్ మెంట్ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద కుమార్ వెల్లడించారు. సండే – ఫండే వంటి కార్యక్రమం చార్మినార్ వద్ద కూడా నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారని, ఈ విషయంలో సలహాలు ఇవ్వాలని తాము నగర వాసులను కోరడం జరుగుతోందన్నారు. దీని ద్వారా..ఈ కార్యక్రమ నిర్వహించడానికి అవసరమైన ప్రణాళికలు నిర్వహించుకోవడానికి వీలవుతుందని తెలిపారు.

Read More : China Army : దక్షిణ చైనా సముద్రంలో అలజడి..తైవాన్‌ను రెచ్చగొట్టేలా చైనా ఆర్మీ విన్యాసాలు

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. దీనికి నెటిజన్లు ఫుల్ రెస్పాండ్ ఇస్తున్నారు. బాగానే ఉంటుందని, ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలని నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ట్యాంక్ బండ్ వద్ద నిర్వహంచాలంటే..వాహన రాకపోకలపై నిషేధం విధించి..ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మరి..చార్మినార్ వద్ద సండే – ఫండే కార్యక్రమం నిర్వహిస్తారా ? లేదా ? అనేది చూడాలి.

ట్రెండింగ్ వార్తలు