Telangana Congress: రాజ్యాంగం ఎందుకు మార్చాలో కేసీఆర్ చెప్పాలి: భట్టి విక్రమార్క

ఎంతో ముందు చూపుతో డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందో కేసీఆర్ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు బట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

Telangana Congress: రాజ్యాంగం మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతుంది. ఎంతో ముందు చూపుతో డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందో కేసీఆర్ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు బట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద లిబర్టీ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నేతలు పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించారంటూ నిరసనకు దిగిన కాంగ్రెస్ నేతలు..ఈమేరకు రాజ్యాంగ రచయిత డాక్టర్ అంబేద్కర్ కు పాలాభిషేఖం చేసి నివాళి అర్పించారు. అనంతరం సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చడానికి మీరెవరంటూ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.

Also read: Patient Death: కంటి ఆపరేషన్ కోసం వస్తే శవాన్ని అప్పగించిన ఆసుపత్రి

ఓటు హక్కు , మహిళలకి సమానహక్కు, భావ స్వేచ కల్పించినందుకు రాజ్యాంగాన్ని మార్చాలా అని బట్టి విక్రమార్క ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్ ని దేశ ప్రజలు క్షమించరని బట్టి విక్రమార్క అన్నారు. టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతా రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ సింబల్ మీద గెలిచిన కేసీఆర్ రాజ్యాంగాన్ని ఆవమానించడం దురదృష్టకరమని అన్నారు. కేసీఆర్ కు రాజ్యాంగంపై గౌరవం లేదని, రాజ్యాంగ విలువ తెలియదని ఆమె అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే అణగారిన వర్గాలకి రిజర్వేషన్లు వచ్చి..వారు అభివృద్ధిలోకి వస్తున్నారని గీతారెడ్డి అన్నారు. కేసీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలనీ గీతారెడ్డి డిమాండ్ చేశారు.

Also read: Pawan Kalyan : లతా మంగేష్కర్ అస్తమయం బాధాకరం

ట్రెండింగ్ వార్తలు