Patient Death: కంటి ఆపరేషన్ కోసం వస్తే శవాన్ని అప్పగించిన ఆసుపత్రి

కంటి ఆపరేషన్ కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళ..వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కోమాలోకి వెళ్లి అనంతరం మృతి చెందింది. ఈఘటన హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని కామినేని ఆసుపత్రిలో చోటుచేసుకుంది.

Patient Death: కంటి ఆపరేషన్ కోసం వస్తే శవాన్ని అప్పగించిన ఆసుపత్రి

Kamineni

Patient Death: కంటి ఆపరేషన్ కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళ..వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కోమాలోకి వెళ్లి అనంతరం మృతి చెందింది. ఈఘటన హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని కామినేని ఆసుపత్రిలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు..కోదాడ మండలం కటకమ్మగూడెం గ్రామానికి చెందిన సుగుణమ్మ (60) అనే మహిళ.. కంటి ఆపరేషన్ నిమిత్తం మూడు నెలల క్రితం ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రిలో చేరింది. ఆపరేషన్ సమయంలో మోతాదుకు మించి మత్తుమందు ఇవ్వడంతో.. సుగుణమ్మ కోమాలోకి వెళ్ళింది.

Also read: Naga Chaitanya: సక్సెస్ ఫార్ములా పట్టుకున్న చైతూ.. ట్రాక్ ఎక్కినట్లే!

దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఆనాటి నుంచి సుగుణమ్మను.. అదే ఆసుపత్రిలో ఉంచి.. ఉచిత వైద్యం అందిస్తున్నారు. కాగా, ఆసుపత్రిలో కోమాలో ఉన్న సుగుణమ్మ ఆదివారం ఉదయం మృతి చెందిందంటూ ఆసుపత్రి సిబ్బంది బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రి యజమాన్యం నిర్లక్ష్యంతోనే తన తల్లి మృతి చెందిందంటూ సుగుణమ్మ కూతురు శోభ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా భర్తను పోగొట్టుకున్నానని.. ఇప్పుడు తల్లి కూడా దూరం అవడంతో తనకు దిక్కెవరంటూ బాధితురాలు శోభ ఆవేదన చెందింది. తనకు న్యాయం చేయాలంటూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగింది.

Also read: PRC Issue : ఉద్యోగులు లేకపోతే నేను లేను.. వారికి మంచి జరిగేలా చేస్తున్నాం