Pawan Kalyan : లతా మంగేష్కర్ అస్తమయం బాధాకరం

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ''భారతీయ సినీ సంగీత లోకంలో ధ్రువతార ‘గానకోకిల’ లతా మంగేష్కర్ గారు తుదిశ్వాస విడిచారనే విషయం తీవ్ర ఆవేదనను కలిగించింది. లతాజీ అస్తమయం భారతీయ సినీ......

Pawan Kalyan :  లతా మంగేష్కర్ అస్తమయం బాధాకరం

Pawan Kalyan

Updated On : February 6, 2022 / 2:30 PM IST

Lata Mangeshkar :  భారత గానకోకిల లతా మంగేష్కర్ గత కొన్ని రోజులుగా కరోనా బారిన పడి మరియు ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ లో చేరారు. కోలుకుంటున్నారు అనుకునేలోపే ఆవిడ కన్నుమూశారు. సింగర్ లతా మంగేష్కర్ మరణంపై దేశ వ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, ప్రేక్షకులు నివాళులు అర్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు ఆమె గురించి పోస్ట్ చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ లతా మంగేష్కర్ కి నివాళులు అర్పిస్తూ ఆమె గురించి మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ”భారతీయ సినీ సంగీత లోకంలో ధ్రువతార ‘గానకోకిల’ లతా మంగేష్కర్ గారు తుదిశ్వాస విడిచారనే విషయం తీవ్ర ఆవేదనను కలిగించింది. లతాజీ అస్తమయం భారతీయ సినీ సంగీతానికి తీరని లోటు. అనారోగ్యం నుంచి కోలుకొని ఇంటికి వెళ్లారు అని తెలుసుకొని స్వస్థత చేకూరింది అనుకొన్నాను. ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. లతాజీ పాటకు భాషాబేధం లేదు. ఆ గళం నుంచి వచ్చిన ప్రతి గీతం సంగీతాభిమానులను మంత్రముగ్ధులను చేసింది. వేలాది గీతాలు ఆలపించిన లతాజీ స్వరం దైవదత్తం అనిపిస్తుంది.”

Singer Lata Mangeshkar : లతా మంగేష్కర్‌‌పై విష ప్రయోగం జరిగింది తెలుసా ?

”తెలుగులో కేవలం రెండు పాటలే పాడినా అవి మరచిపోలేనివి. నిదురపోరా తమ్ముడా…, తెల్ల చీరకు… పాటలు శ్రోతలను మెప్పించాయి అంటే లతాజీ గానమే కారణం. ఏడు దశాబ్ధాలుపైబడి సాగిన ఆమె గానయజ్ఞం, బాల్యం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని తను నిలిచి గెలిచిన తీరు స్ఫూర్తిదాయకం. దైవభక్తి మెండుగా కలిగిన లతాజీకి సద్గతులు ప్రాప్తించాలని, ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.” అని తెలిపారు.