Telangana TDP: ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో టీడీపీ ఆవిర్భావ సభ.. పాల్గోనున్న చంద్రబాబు, రెండు రాష్ట్రాల నేతలు

టీడీపీ 41 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తలపెట్టిన సభను తెలంగాణ టీడీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఇరు రాష్ట్రాల్లోని పార్టీ ముఖ్యనేతలు పాల్గోనున్నారు.

Telangana TDP: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu).. తెలంగాణ రాష్ట్రం  (Telangana State) లోనూ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ (Kasani Gnaneshwar) ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేశారు. ముఖ్యంగా ‘ఇంటింటికీ తెలుగుదేశం’ (Door to Door Telugu Desam) పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. తాజాగా, పార్టీ ఆవిర్భవించి 41 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభ విజయవంతం కావడంతో.. బుధవారం సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ (Nampally Exhibition Grounds) లో నిర్వహించ తలపెట్టిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సభకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి టీడీపీ శ్రేణులు తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు.

TDP @ 40 Years : టీడీపీ ఆవిర్భావానికి ముందు, తర్వాత అని చరిత్ర చదవాలి-చంద్రబాబు నాయుడు

టీడీపీ 41 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తలపెట్టిన సభను తెలంగాణ టీడీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉదయం 10గంటలకు ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ తెలంగాణ ప్రెసిడెంట్ కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ జెండాను ఎగురవేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పూలమాలవేసి నివాళులర్పిస్తారు. సాయంత్రం 4గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగే టీడీపీ ఆవిర్భావ సభలో చంద్రబాబు పాల్గొంటారు. చంద్రబాబుతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ముఖ్యనేతలు పాల్గోనున్నారు.

TDP: అసెంబ్లీ ఎన్నికల్లో యువతకే 40 శాతం టికెట్లు ఇవ్వాలని టీడీపీ నిర్ణయం!

టీడీపీ ఆవిర్భావ సభ సందర్భంగా హైదరాబాద్‌లోని కూడళ్లు పసుపు మయంగా మారాయి. హైదరాబాద్, చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులను రప్పించేలా ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి కూడా టీడీపీ శ్రేణులు ఈ సభకు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ సభలో చంద్రబాబు ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన సభలో తెలంగాణలో టీడీపీ ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధిని చంద్రబాబు వివరించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగే సభలో రాష్ట్రంలో అధికార పార్టీపై చంద్రబాబు విమర్శల దాడికి దిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజధానిలో నిర్వహించే సభ కావడంతో హైదరాబాద్ అభివృద్ధిలో తన పాత్రను తెలుపుతూనే, ప్రస్తుత ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధిస్తాడని టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది.

ట్రెండింగ్ వార్తలు