Telangana 10th Results: తెలంగాణలో టెన్త్ విద్యార్థులకు అలర్ట్ .. ఫలితాలు వచ్చేది ఆరోజే!

తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

TS SSC Results 2025

Telangana 10th Results: తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మరోవైపు ఏపీలో ఇంటర్ ఫలితాలతోపాటు.. టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణలో టెన్త్ ఫలితాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.

Also Read: Hyderabad MLC Election: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఎంఐఎం అభ్యర్థి విజయం.. ఎవరికెన్ని ఓట్లు వచ్చాయంటే..?

తెలంగాణలో మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు పూర్తయ్యి నెలరోజులు కావస్తున్నా ఫలితాల వెల్లడికాకపోవటంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వెల్లడించగా.. టెన్త్ ఫలితాల విడుదలపై పాఠశాల విద్యాశాఖ కసరత్తులు చేస్తోంది.

Also Read: Indus Waters Treaty: ఇండియా దెబ్బ అదుర్స్.. పాకిస్థాన్‌లో కరెంట్ సంక్షోభం..?

టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈనెలాఖరుకు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 28వ తేదీ లేదా 30తేదీల్లో ఫలితాలను అధికారులు విడుదల చేస్తారని సమాచారం. ఇప్పటికే వాల్యువేషన్ ప్రక్రియ పూర్తికాగా.. ఇంటర్నల్ రిజల్ట్ ప్రాసెస్ కూడా పూర్తయింది. దీంతో ఫలితాలు విడుదల చేసేందుకు అనుమతి కోరుతూ సంబంధిత అధికారులు ప్రభుత్వానికి దస్త్రం పంపారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే రిజల్స్ట్ రిలీజ్ చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. మెమోలపై మార్కులతో పాటు డివిజన్స్ పెట్టాలా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

 

ఫలితాలు విడుదలైన తరువాత అధికారిక వెబ్ సైట్ bse.telangana.gov.in లేదా results.bse.telangana.gov.in లో మార్కుల వివరాలు తెలుసుకోవచ్చు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేస్తే ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. అదేవిధంగా SMS ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. దీని కోసం TS10ROLL NUMBER అని టైప్ చేసి 56263కు మెసేజ్ సెండ్‌ చేస్తే చాలు.. మీ ఫలితాలు SMS రూపంలో వస్తాయి.