Police Extensive Checking : బాబోయ్ అంత డబ్బా..! పోలీసుల తనిఖీల్లో ఇప్పటి వరకు ఎన్నికోట్లు పట్టుబడ్డాయో తెలుసా..?

తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు, ఇన్నర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా పట్టుబడుతున్న ..

police checks

Telangana Assembly Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో భారీగా నగదు చేతులు మారుతుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి పోలీసులు, ఎలక్షన్ కమిషన్ బృందాలు ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతీ వాహనాన్ని ఆపి తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో భారీగా నగదు, బంగారం పట్టుబడుతుంది. ఇప్పటి వరకు పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన సొమ్ము రూ. 500 కోట్లు దాటింది. నిన్న (ఆదివారం) ఒక్కరోజే నిజాంపేట్ లో 17 కేజీల బంగారం, 75 కేజీల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read : Bus Accident : విజయవాడ బస్టాండ్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ప్లాట్ ఫామ్ పై నిలుచున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి

తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు, ఇన్నర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా పట్టుబడుతున్న డబ్బు, బంగారం, వెండి, మద్యం, ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. జీఎస్టీ, కస్టమ్స్ అధికారులుసైతం రంగంలోకిదిగి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈనెల 30న పోలింగ్ జరగనుండగా.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు కొందరు నేతలు చేస్తున్న ప్రయత్నాలకు విస్తృత తనిఖీల ద్వారా ఈసీ అడ్డుకట్ట వేస్తుంది.

Also Read : Karnataka Govt Officer kill : హత్యకు గురైన కర్ణాటక ప్రభుత్వ అధికారిణి ఇటీవలే కొన్ని ప్రదేశాలపై దాడులు చేశారు : ప్రతిమ సహోద్యోగి

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రహదారులపై వాహనాలను పోలీసులు విస్తృతంగా తనికీలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలను నిలిపివేసి పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. గత రెండు రోజుల క్రితం మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ను నిలిపివేసి తనిఖీలు నిర్వహించగా.. తాజాగా హోమంత్రి మహమూద్ అలీ వాహనాన్ని పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సమయంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు పోలీసులకు సహకరించారు.