Minister KTR : కేసీఆర్ దార్శనిక నాయకత్వానికి ధన్యవాదాలు.. ఎన్నికల వేళ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..

మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. మన గౌరవనీయులైన సీఎం కేసీఆర్ దార్శనిక నాయకత్వానికి ధన్యవాదాలు చెప్పారు.

Minister KTR : కేసీఆర్ దార్శనిక నాయకత్వానికి ధన్యవాదాలు.. ఎన్నికల వేళ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..

Minister KTR

Updated On : October 12, 2023 / 10:43 AM IST

Telangana Assembly Elections2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 30న రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దఫా ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అధికార బీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల రణరంగంలోకి దూకేందుకు సిద్ధమయ్యాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్  ఇప్పటికే జిల్లాల వారిగా పర్యటిస్తూ సభల్లో పాల్గొంటున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. మన గౌరవనీయులైన సీఎం కేసీఆర్ దార్శనిక నాయకత్వానికి ధన్యవాదాలు చెప్పారు.

Read Also : KTR : అబద్దాల అమిత్ షా పార్టీకి గుణపాఠం తప్పదు, 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు- కేటీఆర్

దేశంలో ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఇచ్చిన రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాను ది ఇండియన్ ఇండెక్స్ అనే సంస్థ ట్వీట్ చేసింది. ఆ జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. దీనిపై మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘ప్రతి ఇంటికి తాగునీరు అందించడానికి మిషన్ భగీరథ అనే ప్రాజెక్ట్ ను ప్రారంభించిన స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ మొదటి రాష్ట్రం. మన గౌరవనీయులైన సీఎం కేసీఆర్ దార్శనిక నాయకత్వానికి ధన్యవాదాలు, తెలంగాణ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని, భారత ప్రభుత్వం హర్ ఘర్ జల్ ను ప్రారంభించిందని కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నాడు. కొన్ని సంవత్సరాల తరువాత ఈ రోజు తెలంగాణ ఏం చేస్తుందో, మిగిలిన భారతదేశం రేపు అనుసరిస్తుందంటూ కేటీఆర్ అన్నారు.

Read Also : KTR : ఎక్కడా వ్యతిరేకత కనిపించలేదు, మళ్లీ కేసీఆరే సీఎం- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ఇండియన్ ఇండెక్స్ అనే సంస్థ ప్రకారం.. కుళాయి నీటి కనెక్షన్ తో 100 శాతం కుటుంబాలు ఉన్న రాష్ట్రాల పేర్లను పేర్కొంది. అందులో మొదటి స్థానంలో తెలంగాణ నిలిచింది. ఆ తరువాత గుజరాత్, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, అండమాన్ నికోబార్ దీవులు, దాద్రా మరియు నగర్ హవేలీ మరియు డామన్ మరియు డయ్యూ , పుదుచ్చేరి ఉన్నాయని తెలిపింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 70.48శాతం కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నట్లు ఇండెక్స్ నివేదిక పేర్కొంది.