T.assembly
Telangana Assembly : భారీ వర్షాల కారణంగా మూడు రోజుల కింద వాయిదా పడిన.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభంకానున్నాయి. సెప్టెంబర్ 24న శాసనసభ ఎనిమిదో విడత సమావేశాలు మొదలుకాగా.. రెండు రోజులు మాత్రమే జరిగాయి. భారీ వర్షాల కారణంగా మూడు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు 27వ తేదీన స్పీకర్ కార్యాలయం బులెటిన్ విడుదల చేసింది. 2021, అక్టోబర్ 01వ తేదీ శుక్రవారం జరిగే శాసనసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగిశాక హరితహారంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.
Read More : T.Congress : హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ?
శాసనమండలిలో ప్రశ్నోత్తరాల తర్వాత ఐటీ, పరిశ్రమల శాఖపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. ఇక అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా అసెంబ్లీ, శాసనమండలి భేటీలకు విరామం ఉంటుంది. తిరిగి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఉభయ సభల సమావేశాలు జరుగుతాయి. ఒకవేళ సమావేశాలు పొడిగించే పక్షంలో 5న జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.
Read More : Huzurabad : నామినేషన్ల పర్వం షురూ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంపై అసెంబ్లీలో చర్చ జరగనుండటంతో.. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో అటవీ శాఖ అధికారులతో సమీక్షించారు. మంత్రులు, ప్రత్యేకాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రంలో హరితహారం ద్వారా సాధించిన ఫలితాలు, గణాంకాలు, ఇతర వివరాలను వారు సీఎంకు అందజేశారు.