Kishan Reddy : తెలంగాణలో జమిలి ఎన్నికలపై కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్

ఎన్నికలకు సన్నద్ధం కావాలని.. మీ పని మీరు చేసుకుపోండి అని నేతలకు దిశానిర్దేశం చేశారు. Kishan Reddy - Jamili Elections

Kishan Reddy - Jamili Elections

Kishan Reddy – Jamili Elections : హైదరాబాద్ లో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జమిలి ఎన్నికలు జరగవని అన్నారు. అసెంబ్లీ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. అసెంబ్లీ, లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు జరగవని కిషన్ రెడ్డి వెల్లడించారు.

శుక్రవారం(సెప్టెంబర్ 8) హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం జరిగింది. ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. వారికి దిశానిర్దేశం చేశారు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. జమిలి ఎన్నికలపై కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్నారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జమిలి ఎన్నికలు వస్తాయని, అసెంబ్లీకి లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని వార్తలు వస్తున్నాయి.

Also Read..Jamili Elections: జమిలి ఎన్నికలకు ఉన్న అవాంతరాలేంటి.. తెలంగాణ ఎన్నికల వాయిదాకు అవకాశం ఉందా?

ఇలాంటి తరుణంలో తెలంగాణలో జమిలి ఎన్నికలు జరగవని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. అసెంబ్లీకి, లోక్ సభకు వేర్వేరుగానే ఎలక్షన్స్ జరుగుతాయని ఆయన తేల్చి చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే శాసనసభ ఎన్నికలు జరుగుతాయన్న కిషన్ రెడ్డి.. మీ పని మీరు చేసుకుపోండి అని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు సన్నద్ధం కావాలి అంటూ పార్టీ నేతలకు డైరెక్షన్స్ ఇచ్చారు కిషన్ రెడ్డి. జమిలి ఎన్నికలు ఉండవు అంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో డిస్కషన్ కు దారితీశాయి.

ఈ నెలలో జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లు ఉంటుందని కీలకమైన చర్చ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో కిషన్ రెడ్డి కామెంట్స్ రాష్ట్ర రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. పార్లమెంటు సమావేశాల్లో జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లు ఉండదనే స్పష్టత వచ్చే విధంగా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా పార్లమెంటు సెషన్స్ లో జమిలి ఎలక్షన్స్ కు సంబంధించిన బిల్లు పెడతారా? లేదా? అన్నదానిపై త్వరలోనే స్పష్టత రానుంది.

Also Read..Jamili Elections: వన్ నేషన్, వన్ ఎలక్షన్.. బీజేపీ వ్యూహమేంటి.. విపక్షాల అభ్యంతరాలేంటి?

ఇది ఇలా ఉంటే.. ఇప్పుడు దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల అంశంపై హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది. జమిలి ఎన్నికలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దూకుడును పెంచింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల శాసనసభలకు, లోక్‌సభకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న కేంద్రం.. ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నెలలోనే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు పిలుపునివ్వడంతోనే జమిలి ఎన్నికల గురించి దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. ఆ వెంటనే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో 8మంది సభ్యులతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడం మరింత ఆసక్తికరంగా మారింది. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి కేంద్రం మొగ్గు చూపడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల అంశం చర్చనీయాంశమైంది.

ట్రెండింగ్ వార్తలు