Telangana : మోదీ ఇలాఖాలో కేసీఆర్ ఫ్లెక్సీలు, సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2022, ఫిబ్రవరి 17వ తేదీ 68 ఏటలో అడుగు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బర్త్ డేను ఘనంగా నిర్వహించుకోవాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. జన్మదిన సంబరాలను

Telangana : మోదీ ఇలాఖాలో కేసీఆర్ ఫ్లెక్సీలు, సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పం

Kcr Birthday

Updated On : February 16, 2022 / 7:43 PM IST

Telangana CM KCR Birthday : కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్న కేసీఆర్‌.. ప్రధాన మంత్రి మోదీ ఇలాఖాలో బలప్రదర్శన చేస్తున్నారు. తెలంగాణ నా అడ్డా అంటూ ప్రకటించిన కేసీఆర్‌.. మోదీ సొంత రాష్ట్రంలోనూ తనకు బలం ఉందని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ కోటలు బద్దలు కొడతామంటూ హెచ్చరించిన కేసీఆర్‌ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా రాజకీయ బలాన్నే కాకుండా.. ప్రజా మద్దతును కూడా ప్రదర్శించే పనిలో ఉన్నారు. ఆయన బర్త్‌ డే వేడుకలే దీనికి వేదికగా మారాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ భారీ హోర్డింగ్స్‌, ఫ్లెక్సీలు వెలిశాయి. ఆయన పేరిట అన్నదానాలు, సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇటు కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలకు ఢిల్లీ కూడా సిద్ధమైంది. సీఎం జన్మదిన వేడుకలను టీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఢిల్లీ తెలంగాణ భవన్‌, కేసీఆర్‌ నివాసం వద్ద కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఢిల్లీ రోడ్లపై భారీ హోర్డింగ్స్‌, ఫ్లెక్సీలతో కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు. ఢిల్లీ తెలంగాణ భవన్, కేసీఆర్ నివాసం వద్ద భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలతో ఇక ఒడిశాలోనూ సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. పూరీ జగన్నాథుడి చెంత, పద్మ శ్రీ సుదర్శన్ పట్నాయక్.. సైకత శిల్పంతో శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేటకు చెందిన వంగ రాజేశ్వర్ రెడ్డి సమన్వయంతో సైకత శిల్పాన్ని పద్మ శ్రీ సుదర్శన్ పట్నాయక్ రూపొందించారు.

Read More : Telangana BJP : కేసీఆర్‌‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2022, ఫిబ్రవరి 17వ తేదీ 68 ఏటలో అడుగు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బర్త్ డేను ఘనంగా నిర్వహించుకోవాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. జన్మదిన సంబరాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించుకోవాలని డిసైడ్ అయ్యింది. సేవా దృక్పథాన్ని చాటుకొనేలా సంబరాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలన్నారు మంత్రి కేటీఆర్. 2022, ఫిబ్రవరి 15వ తేదీ మంగళవారం నుంచి మూడురోజుల పాటు సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. 16న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదాన శిబిరాల్లో టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. 17న కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటే కార్యక్రమాలు చేయాలన్నారు కేటీఆర్. పార్టీ శ్రేణులు ఎవరికి వారు తమ సేవా దృక్పథాన్ని చాటేలా ఆసుపత్రులు, వృద్థాశ్రమాలు, అనాథాశ్రమాల్లో అన్నదానం, పండ్లు, దుస్తుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. అలాగే ఇతరులకు సహాయ పడేందుకు గిఫ్ట్‌ ఎ స్మైల్‌ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి వాలీబాల్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నారు. మంగళవారం నుంచి 17 వరకు ఎల్బీ స్టేడియంలో మహిళలు, పురుషుల విభాగాల్లో వాలీబాల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.