KCR Meet Stallin
KCR Meet Stalin : తమిళనాడు పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు ఆరాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్‌తో భేటీ అయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్, స్టాలిన్ నివాసానికి వెళ్ళారు. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయ పునః ప్రారంభ వేడుకలకు రావాల్సిందిగా సీఎం కేసీఆర్ స్టాలిన్ ను ఆహ్వానించారు.
మార్చి 22న సుదర్శన యాగంతో ప్రారంభమయ్యే వేడుకలు 28న అర్ధరాత్రి ముగియనున్నాయి. ఆ వారం రోజుల్లో ఏదో ఒకరోజు వచ్చి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవాలని స్టాలిన్‌ను కేసీఆర్ కోరారు. చెన్నైలో జరిగిన భేటీలో దేశ రాజకీయాలతోపాటు, రాష్ట్రాల పట్ల కేంద్ర వైఖరి, సమాఖ్య స్ఫూర్తికి గండి కొడుతున్న తీరుపై ఇద్దరు సీఎంలు చర్చించారు. పర్యటనలో కేసీఆర్ వెంట మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ఉన్నారు.