CM Revanth Reddy: ఏకంగా సీఎం వీడియోనే మార్పింగ్.. తప్పుడు ప్రసంగాలు ప్రచారం.. మరి పోలీస్ లు ఊరుకుంటారా!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)కి సంబంధించిన నకిలీ వీడియోను సృష్టించి సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తులపై సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు.
Telangana cm revanth reddy morphed video cyber crime case registered
- సీఎం రేవంత్ వీడియో మార్ఫింగ్.
- ఇన్స్టాగ్రామ్ రీల్స్‌తో నెటిజన్ల అతి.
- సైబర్ క్రైమ్ పోలీసుల కేసు.
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సంబంధించిన నకిలీ వీడియోను సృష్టించి సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తులపై సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం చిత్రాన్ని డిజిటల్‌గా మార్ఫింగ్ చేయడమే కాకుండా, ఆయన మాట్లాడినట్లుగా అసత్య వ్యాఖ్యలతో కూడిన ఒక డీప్‌ఫేక్ వీడియోను కొందరు దుండగులు ఇన్స్టాగ్రాం రీల్స్‌లో అప్లోడ్ చేశారు. ఈ నెల 6న విధి నిర్వహణలో భాగంగా సోషల్ మీడియాను పరిశీలిస్తున్న సైబర్ క్రైం ఎస్సై పి.జయప్రకాశ్ ఈ నకిలీ వీడియోను గుర్తించారు. సదరు వీడియోలో ముఖ్యమంత్రి (CM Revanth Reddy)ప్రసంగం ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉందని, సమాజంలో అనర్థాలకు దారి తీసేలా ఆ వ్యాఖ్యలను సృష్టించారని అధికారులు నిర్ధారించారు.
ఈ మార్ఫింగ్ వీడియో వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగే ప్రమాదం ఉందని గ్రహించిన ఎస్సై జయప్రకాశ్ వెంటనే సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారానికి పాల్పడిన నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి, ఆ వీడియోను సృష్టించిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
