మేడారంలో గద్దెలను పునఃప్రారంభించిన రేవంత్‌ రెడ్డి.. మనవడితో కలిసి నిలువెత్తు బంగారం సమర్పణ

కుటుంబ సభ్యులతో కలిసి సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

మేడారంలో గద్దెలను పునఃప్రారంభించిన రేవంత్‌ రెడ్డి.. మనవడితో కలిసి నిలువెత్తు బంగారం సమర్పణ

Revanth Reddy (Image Credit To Original Source)

Updated On : January 19, 2026 / 11:32 AM IST
  • కుటుంబ సభ్యులతో కలిసి మేడారానికి రేవంత్
  • సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న సీఎం
  • గద్దెల ప్రాంగణంలో పైలాన్‌ ఆవిష్కరణ

Revanth Reddy: మేడారం గద్దెలతో పాటు ఆలయ ప్రాంగణాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇవాళ పునఃప్రారంభించారు. కుటుంబ సభ్యులతో కలిసి సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

తన మనవడితో కలిసి రేవంత్‌ రెడ్డి నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. గద్దెల ప్రాంగణంలో పైలాన్‌ ఆవిష్కరించారు. రేవంత్‌ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు.

Also Read: ఈసారి భిన్నంగా వేసవి కాలం.. ఏం జరగనుందంటే?

అనంతరం మేడారం నుంచి రేవంత్‌ రెడ్డి హెలికాప్టర్‌లో హైదరాబాద్ బయలుదేరారు. నేరుగా శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు.

నేటి నుంచి ఈ నెల 23 వరకు దావోస్‌లో జరగనున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో రేవంత్‌ రెడ్డి బృందం పాల్గొని తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. రాష్ట్ర లైఫ్‌ సైన్సెస్‌ పాలసీతో పాటు తెలంగాణ ఏఐ హబ్‌ను అక్కడి నుంచే రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.