అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసు.. సీఎం రేవంత్ రెడ్డికి సమన్లు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసు విచారణలో భాగంగా ఈ సమన్లు పంపారు.

CM Revanth Reddy Summoned: కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసింది. కేసు విచారణలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. మే 1న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొనట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరో నలుగురికి ఢిల్లీ పోలీసులు సమన్లు పంపించారు.

అమిత్ షా పేరుతో ఫేక్ వీడియోను కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ X హ్యాండిల్ షేర్ చేసిందని బీజేపీ ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫేక్ వీడియో ఎవరు తయారు చేశారన్న దానిపై స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారు. కాగా, డీప్ ఫేక్ వీడియోలు చేసిన వారికి తగిన బుద్ధి చెబుతామని కర్ణాటక సభలో ప్రధాని నరేంద్ర మోదీ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా చెప్పినట్టుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే ఇది ఫేక్ వీడియో అని బీజేపీ, కేంద్ర హోంశాఖ ఫిర్యాదు చేయడంతో IPC సెక్షన్ 153, 153A, 465, 469, 171G.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టంలోని సెక్షన్ 66C కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోనూ కేసులు నమోదు కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీడియోను అప్‌లోడ్ చేసిన, షేర్ చేసిన ఖాతాల సమాచారాన్ని కోరుతూ పోలీసులు X(ట్విటర్), Facebookకి నోటీసులు కూడా పంపారు.

Also Read: రేవంత్ రెడ్డి రాజకీయ మూల్యం చెల్లించకోక తప్పదు: మందకృష్ణ మాదిగ వార్నింగ్

గాంధీ భవన్‌కు ఢిల్లీ పోలీసులు
ఢిల్లీ పోలీసులు సోమవారం హైదరాబాద్ లోని గాంధీభవన్‌కు వచ్చారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జ్ మన్నే సతీష్ పేరుతో 91 కింద నోటీసులు ఇచ్చారు. ఎవరు ఫిర్యాదు చేశారని ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులను కాంగ్రెస్ నేతలు అడిగారు.

ట్రెండింగ్ వార్తలు