×
Ad

MP Komatireddy Venkat Reddy : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ

హైదరాబాద్-విజయవాడ హైవే నిర్మాణంపై కేంద్ర రోడ్లు, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీకి వెంకట్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

  • Published On : February 14, 2023 / 02:15 PM IST

MP Venkat Reddy

MP Komatireddy Venkat Reddy : హైదరాబాద్-విజయవాడ హైవే నిర్మాణంపై కేంద్ర రోడ్లు, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీకి వెంకట్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ వరకు జీఎంఆర్ రోడ్డు ఆరు లైన్లు చేయాలని కేంద్రమంత్రిని కోరామని.. త్వరలో ప్రారంభం అవుతాయని తెలిపారు. విజయవాడ, హైదరాబాద్ మధ్య ట్రాఫిక్ పెరిగిందని.. ప్రమాదాలు పెరిగాయని చెప్పారు.

అనేక సార్లు గడ్కరీని కలిశానని.. అలాగే ప్రధానికి వినతిపత్రం అందజేశానని చెప్పారు. మార్చి మొదటి వారంలో హైదరాబాద్ -విజయవాడ ఆరు లైన్ల రహదారిలో ప్రమాద జోన్లలో చేయాల్సిన పనులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రజల తరపున నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపినట్లు పేర్కొన్నారు. 2022, ఏప్రిల్ లోనే పనులు ప్రారంభం కావాల్సి ఉన్నా జీఎం ఆర్ సంస్థ ఆర్బిట్రేషన్ కి వెళ్లడంతో పనులు ఆగాయని చెప్పారు.

MP Komatireddy Venkat Reddy: తెలంగాణలో హంగ్ ఖాయం.. కేసీఆర్ కాంగ్రెస్‌ను పొగడటం పొలిటికల్ డ్రామా

రీజనల్ రింగ్ రోడ్డు గురించి కేంద్ర మంత్రితో చర్చించానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 500 కోట్లు ఇవ్వలేదన్నారు. భువనగిరి పరిధిలోని రీజనల్ రింగ్ రోడ్డుకి భూసేకరణ సమస్యల పరిష్కారం, రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇస్తే త్వరలో రీజనల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు.